ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్ లేవ్ ? ఆక్రమించుకోవడాలే ?

వైసీపీ ప్రభుత్వం ఎంత వేగంగా ముందుకు వెళ్దాం అని చూస్తున్నా, ఆ అవకాశమే లేకుండా ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయం జగన్ కు , ఆ పార్టీ నేతలకు కంగారు పుట్టిస్తోంది.తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసి రాజకీయంగా తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న , ఎప్పటికప్పుడు వాటికి చెక్ పెడుతూ , పైచేయి సాధించడం లో, చంద్రబాబు సక్సెస్ అవుతునే వస్తున్నారు.

 Chandrababu Hot Comments On Kidco Houses Distribution Ap, Jagan, Chandrababu Na-TeluguStop.com

ప్రతి దశలోనూ జగన్  ముందరి కాళ్ళ బంధం వేస్తూ టిడిపి వస్తోంది .ఇది ఇలా ఉంటే , అమరావతి వ్యవహారంను వైసిపి, టీడీపీలు రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి రాజధాని ని విశాఖ కు తరలించాల నే పట్టుదలతో జగన్ ఉండగా, వాటికి చెక్ పెడుతూ సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు.

పార్టీ శ్రేణులను సైతం అమరావతికి మద్దతుగా తమ తమ ప్రాంతాల్లో నిరసనలు,  ఆందోళనలు చేపట్టాలని పదేపదే పిలుపు ఇస్తున్నారు .అయిన అమరావతి విషయంలో టిడిపి నాయకులు పెద్ద ఆసక్తి చూపించకపోవడం తో బాబు మరో సరికొత్త ఎత్తుగడ తెరతీశారు.కొత్తగా టిడ్కో ఇళ్ల వ్యవహారాన్ని బాబు తెరపైకి తీసుకువచ్చారు.13 జిల్లాల్లో టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్మెంట్లు, ఏవీ ప్రజలకు అందలేదు.పోనీ వైసిపి ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ, గత టీడీపీ ప్రభుత్వం కట్టిన  ఇళ్ల తో పాటు, కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తయిన ఇళ్ళూ, ఏవి ఇప్పటి వరకు ప్రజలకు అందలేదు.

ప్రజలంతా ఈ ఇళ్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.ఒక రకంగా వైసిపి ప్రభుత్వం పైన అసంతృప్తి చెలరేగుతోంది.ప్రజల్లో ఈ అసంతృప్తి గుర్తించిన బాబు, దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు సంక్రాంత్రి నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టకపోతే, ఆ తర్వాత ఇళ్ల స్థలాలను , అపార్ట్మెంట్లను ఆక్రమించుకుంటారు అంటూ కొత్త విషయాన్ని బయటపెట్టారు.

ఈ రకంగా ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజల్లో టిడిపి పలుకుబడి పెంచుకోవాలని చూస్తున్నారు.అమరావతి వ్యవహారంపై పార్టీ నాయకుల నుంచి సైతం పెద్దగా స్పందన రాకపోవడంతో, ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే అంశం కాకపోవడం వంటి కారణాలతో ఇప్పుడు పూర్తిగా ఈ వ్యవహారం  డీల్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube