కరుణానిధి ని గెలిపిస్తున్న చంద్రబాబు ?

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి సంబంధించి ప్రస్తుత విపక్ష వైసీపీకే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపించాయి.అయితే రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రుణమాఫీ అస్త్రాన్ని వదిలారు.

 Chandrababu Helps Karunanithi-TeluguStop.com

ఇదే అస్త్రం వైసీపీని విపక్షంలో కూర్చోబెట్టి… టీడీపీకి అధికారం కలేనన్న వాదనను పటా పంచలు చేస్తూ చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.ప్రస్తుతం ఏపీ పొరుగు రాష్ట్రం, ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటగా ఉన్న తమిళనాడులో కూడా చంద్రబాబు మంత్రదండమే నిర్ణయాత్మక శక్తిగా మారిందన్న వాదన వినిపిస్తోంది.

నిన్నటిదాకా అధికార అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న వాదన వినిపించగా, నిన్న పోలింగ్ ముగియగానే వెలువడ్డ సర్వేల్లో డీఎంకేదే పైచేయి అన్న మాట వినపడింది.దాదాపుగా అన్ని సర్వేలదీ ఇదే మాట.ఈ క్రమంలో ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు డీఎంకే చీఫ్, ఆ రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కరుణానిధి ఏం మాయ చేశారు? అన్న అంశంపై చర్చ జరిగింది.

కొత్త అస్త్రమేదీ ప్రయోగించని కరుణానిధి… ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగించిన ‘రుణ మాఫీ’ అస్త్రాన్నే నమ్ముకున్నారని తేటతెల్లమైంది.

అప్పటిదాకా ‘ఆల్ ఫ్రీ’ అన్న జయలలిత నినాదానికి మొగ్గు చూపినట్లు కనిపించిన తమిళ తంబీలు… రుణ మాఫీపై కరుణ ఇచ్చిన హామీ వైపు మళ్లారని తేలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube