బాబు లో గెలుపు ధీమా.. జూనియర్ పీకే రిపోర్ట్ ?

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసారు.ఎన్ని సంక్షోభాలు ఎదురయినా, ఎన్నిఇబ్బందులు ఎదురయినా అన్నిటినీ తట్టుకుంటూ ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నారు.

 Chandrababu Happy On Rabin Sarma Report On Tirupathi By Elections, Jagan, Tdp, T-TeluguStop.com

పార్టీ పరిస్థితి అథమ పాతాళానికి వెళ్లిపోయినా, ఏదో రకంగా పైకి తీసుకు రాగల దిట్ట చంద్రబాబు.  అందుకే అఖండ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ దూకుడును తట్టుకుంటూనే, నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంలో అనుకున్న మేరకు సక్సెస్ అయ్యారు.

ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికలలో టిడిపి కి ఘోరాతిఘోరమైన ఫలితాలు వస్తాయని అంతా అంచనా వేయగా, కాస్తో కూస్తో పర్వాలేదు అన్నట్లుగానే టిడిపి మద్దతుదారులు గెలిచారు.ఇక ఇప్పుడు బాబు దృష్టి అంతా తిరుపతి ఉప ఎన్నికలపై ఉంది.

ఇక్కడ ఏదో రకంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు.ఇక్కడ గెలవడం ద్వారా జగన్ హవాకు బ్రేక్ లు వేయవచ్చు అనేది బాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం చూస్తే వైసీపీ ప్రభుత్వం పై కాస్త వ్యతిరేకత పెరగడం, తమకు కలిసొస్తుందని బలంగా నమ్ముతున్నారు.అందుకే ఎక్కువగా తిరుపతిలో గెలిచేందుకు ఆ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఎక్కువగా బాబు పర్యటిస్తున్నారు.

దీనికి తోడు గతంలో వైసిపి కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేసిన సమయంలో అప్పట్లో ఆయన టీమ్ లో కీలకంగా వ్యవహరించిన రాబిన్ శర్మ పీకే టీమ్ నుంచి విడిపోయి సొంతంగా ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు.ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉండడం, తిరుపతి ఉప ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలు రూపొందించడం వంటి కారణాలతో కాస్తో కూస్తో టీడీపీ లో ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

Telugu Chandrababu, Jagan, Rabin Sarma, Sarvy, Tirupathi-Telugu Political News

అలాగే తిరుపతి పార్లమెంటు పరిధిలోని పరిస్థితులపై రాబిన్ శర్మ ఇచ్చిన రిపోర్టు బాబు కు బూస్ట్ లా మారింది.వైసీపీ ప్రభుత్వంపై పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోందని, అలాగే గ్రామీణ ప్రాంతాలలోనూ ఇప్పుడిప్పుడే జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత మొదలైందని,  దీనిని తెలుగుదేశం పార్టీ సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఇక్కడ గెలవడం కష్టమేమి కాదని రాబిన్ శర్మ ఇచ్చిన నివేదికతో చంద్రబాబు లో మరింత ధీమా పెరిగిందట.అందుకే తరచుగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు.మండలాల వారీగా పార్టీ ఇంచార్జ్ లను నియమించి ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను హైలెట్ చేసుకుని, ఈ ఉప ఎన్నికలలో గెలవాలి అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నరట.

ఇప్పటికే ఇక్కడ నుంచి పనబాక లక్ష్మి ని అభ్యర్థిగా నిలబెట్టడం తో,  పూర్తిగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెడితే తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తామనే ధీమా బాగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube