ఇక జంపింగ్ లు లేనట్టే ? బాబు ఆనందానికి కారణం ఇదే ?

ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న పరిస్థితులతో వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.పూర్తిగా తమ ప్రమేయం లేకుండానే వైసిపి ఇలా కష్టాలు ఎదుర్కోవడం ఒక పక్క తెలుగుదేశం పార్టీ లో ఉత్సాహం కలిగిస్తుంది.

 Chandrababu Happy On Central Government Desistion About Increasing The Number Of Assembly Constituencies-TeluguStop.com

జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మెడకే చుట్టుకుని ఇబ్బందులు పెడుతున్నాయని, ముందు ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోవడంతో పాటు, సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా కోత విధించాల్సిన పరిస్థితి ఉంటుందనేది చంద్రబాబు అభిప్రాయం.ఈ విధంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కోవడం ద్వారా, మళ్లీ జనాలు చూపు తెలుగుదేశం పార్టీపైనే పడుతుందని, మళ్ళీ తాము అధికారంలోకి వచ్చేందుకు ఈ పరిణామాలు దోహదం చేస్తాయని చంద్రబాబు బాగా నమ్ముతున్నారు.

ఇదే కాదు, ఇప్పట్లో ఏపీలో నియోజకవర్గాల పెంపు లేదు అనే విషయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో, చంద్రబాబు చాలా సంతోషంతో ఉన్నారు.ఎందుకంటే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన ఎంతోమంది కీలక నాయకులకు తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో సీటు ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది.

 Chandrababu Happy On Central Government Desistion About Increasing The Number Of Assembly Constituencies-ఇక జంపింగ్ లు లేనట్టే బాబు ఆనందానికి కారణం ఇదే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్వరలో నియోజకవర్గాల పెంపు భారీగా ఉంటుందని ఖచ్చితంగా మీకు అవకాశం దక్కుతుందని, ఎంతో మందిని చేర్చుకున్నారు.ఆ నాయకులకు ఇప్పుడు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కకపోయినా, తమకు సీటు దక్కుతుందిలే అనే అభిప్రాయంతో సర్దుకుపోతూ వస్తున్నారు.

వైసీపీ కూడా తప్పనిసరిగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని ఆశలు పెట్టుకుంది.

Telugu Ap, Ap Cm Jagan, Ap Government, Asembly Seats, Central Government, Chandrababu, Constencyes, Tdp, Tdp Leaders, Ysrcp-Telugu Political News

ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ వస్తోంది.అయితే ఇప్పుడు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడంతో ,ఇక నియోజకవర్గాల పెంపు లేనట్టే అనే విషయం అర్థం అయిపోయింది.ఈ వ్యవహారంతో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్దగా వలసలు ఉండవని, చేరాలనుకున్న నాయకులు సైతం సైలెంట్ గా ఉండి పోవడంతో పాటు, మళ్ళీ టిడిపిలో యాక్టివ్ గా పని చేస్తారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా ఎన్నికలకు మూడు ఏళ్ల సమయం కూడా లేకపోవడంతో ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో నియోజకవర్గం పై పట్టు పెంచుకునేందుకు టిడిపి నేతలంతా ప్రయత్నిస్తారని, ఇది ఎంతగానో తమ పార్టీకి మేలు చేస్తుందని బాబు అభిప్రాయపడుతున్నారట.

#Ysrcp #Chandrababu #Constencyes #TDP #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు