జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆ జీవోలను భోగి మంటలలో వేసిన బాబు..!!  

సంక్రాంతి పండుగ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.భోగి నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ పాల్గొంటూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

TeluguStop.com - Chandrababu Govt Bhogi Mantalu

ఈ క్రమంలో కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా జగన్ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన 5 జీవో ప్రతులను భోగి మంటల్లో వేయటం జరిగింది.

TeluguStop.com - జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆ జీవోలను భోగి మంటలలో వేసిన బాబు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా రైతులకు సంక్రాంతి పండుగ లేకుండా జగన్ చేశారని, అందుకే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను భోగి మంటల్లో దహనం చేసినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు.పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొనడం జరిగింది.

మామూలుగా అయితే భోగి వంటలలో ఇంటిలో ఉండే పాత వస్తువులను పనికిరాని చెత్త వేస్తూ ఉంటారు.కానీ రివర్స్ గా చంద్రబాబు వైసిపి జీవోలను భోగిమంటల్లో వేయటం రాజకీయవర్గాలలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

 

#Jagan #Kesineni Nani #Devineni Uma #Vijaywada #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Govt Bhogi Mantalu Related Telugu News,Photos/Pics,Images..