బాబు ఢిల్లీ టూర్ .. ! వారు మాత్రం దూరంగానే ..?

ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ కి వెళ్లనున్నారు.అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు , బీజేపీ పెద్దలను కలిసి ఏపీ ప్రభుత్వం పైన, ఏపీ లో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల పైన ఫిర్యాదు చేయబోతున్నారు.

 Chandrababu Going To Delhi To Complain Against The Ap Government But May Not Hav-TeluguStop.com

బిజెపికి దగ్గర అయ్యేందుకు అనేక ఎత్తుగడలను రూపొందించుకుని మరీ వెళ్తున్నారు.ఏపీలో వైసిపి అరాచకాలకు పాల్పడుతోందని, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతోంది అని, వెంటనే ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఇంకా ఎన్నో అంశాలపై ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు బాబు ఢిల్లీ టూర్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.

  అయితే బాబుకు ఢిల్లీ టూర్ అంతగా కలిసి వస్తుందా అంటే రాదు అని చెప్పాలి.

ఎందుకంటే గతంలో మాదిరిగా చంద్రబాబుకు బిజెపి అంతగా ప్రాధాన్యం ఇస్తుందా అంటే అది అనుమానమే.

ఎందుకంటే గతంలో అనేకసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం,  అవసరం తీరిన తర్వాత బిజెపి పైన చంద్రబాబు విమర్శలు చేయడం,  స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో ఆయన కాన్వాయ్ పై టిడిపి శ్రేణులు రాళ్ల దాడికి దిగడం వంటివి వ్యవహారాలని ఇప్పటికీ బీజేపీ పెద్దలెవరు మర్చిపోలేదు.అందుకే బాబు పర్యటన ను వారు అంతగా పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు.

పోనీ మిగతా జాతీయ పార్టీలు గానీ, గతంలో తమతో సన్నిహితంగా మెలిగిన ప్రాంతీయ పార్టీల అధినేతలను కానీ, ఏపీలో టీడీపీ పై జరిగిన దాడుల వ్యవహారంలో స్పందించి సానుభూతి తెలుపుతారా అంటే అది కూడా అనుమానమే.
 

-Telugu Political News

దీంతో చంద్రబాబు ఢిల్లీ టూర్ నిరుపయోగం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.బీజేపీ పెద్దలు ఎవరు చంద్రబాబు  విషయంలో అంత సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించకపోవచ్చు అనే సంకేతాలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి.  కాకపోతే టిడిపి శ్రేణులతో పాటు చంద్రబాబు ఢిల్లీ టూర్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

రాజకీయంగా మైలేజ్ తీసుకువచ్చేందుకు ఢిల్లీ టూర్ ఉపయోగపడుతుంది అనే అభిప్రాయంలో ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube