ఏపీ లో మరోసారి నెలకొన్న ఉత్కంఠత...బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో

ఏపీ లో ఇప్పుడు మరోసారి ఉత్కంఠత కొనసాగుతుంది.మొన్న ఎన్నికల ఫలితాల విడుదల సమయంలో ఎంత ఉత్కంఠత నెలకొనిందో అంతకంటే ఎక్కువ ఉత్కంఠత చోటుచేసుకుంది.

 Chandrababu Giving The Clarity About Tdlp Leader In Tdp Party-TeluguStop.com

కారణం ఏమిటంటే ఈ రోజు టీడీఎల్పీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో టీడీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సమావేశంలో నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అన్న ఆసక్తి రేగుతుంది.

మరోపక్క ఘోర ఓటమి కి పార్టీ ప్రక్షాళన అవసరం అని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ శాసనసభా పక్ష నేత పదవిని వదులుకునేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనితో ఈ సమావేశం పై మరింత ఉత్కంఠత నెలకొనింది.

ఏపీలో వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో… టీడీపీకి శాసన సభలో ఒకరకంగా అగ్నిపరీక్షే ఎదురుకానుందనే టాక్ వినిపిస్తోంది.వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మంచి వాగ్ధాటి ఉన్న నేతకు టీడీఎల్పీ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

టీడీఎల్పీ పదవిని అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌కు ఇవ్వాలని బాబు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా జగన్ దీనిపై విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు.

నాకు భయపడి బాబు తన టీడీఎల్పీ పదవి నుంచి తప్పుకున్నట్లు విమర్శలు చేస్తారు అన్న సందేహాలు ఉన్నాయి.మరి నిజంగా బాబు ఆ నిర్ణయం తీసుకొని వైసీపీ కి ఛాన్స్ ఇస్తారా లేదంటే ముందు ముందు కూడా అదే పదవిలో కొనసాగుతారా అన్న ఉత్కంఠత నెలకొనింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube