బస్తీమే సవాల్ ! ఇంతకీ జైలు కి వెళ్లేది ఎవరు ?

అధికార విపక్ష పార్టీల మధ్య ఏపీ రాజధాని వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నాయి.ఎప్పుడైతే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారనే చర్చ మొదలయ్యిందో అప్పటి నుంచే వైసిపి, టిడిపి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

 Chandrababu Give The Challenge To Jagan Mohan Reddy-TeluguStop.com

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే భారీ ఎత్తున భూములు తెలుగుదేశం అగ్ర నాయకులంతా బినామీ పేర్లతో కొనుగోలు చేశారని, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.దీనికి స్పందనగా విశాఖలో వైసీపీ నేతలు భారీగా భూములు కొన్నారని, అందుకే ఇంత అకస్మాత్తుగా రాజధానిని తరలిస్తున్నారని టిడిపి ఆరోపణలు చేస్తోంది.

Telugu Chandrababu, Chandrababugive-

అధికార పార్టీ మాత్రం అమరావతిలో 2014 డిసెంబర్ కి ముందు అక్కడ ఎవరెవరు భూములు కొన్నారు అనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ వివరాలు తెప్పించుకుంది.దీని ప్రకారం ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారో,,ఎవరెవరు ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారో తమకు ఆధారాలతో సహా తెలిసిపోయిందని ప్రభుత్వం చెబుతోంది.టిడిపి నాయకులు, చంద్రబాబు బంధువులు ముందుగానే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని, ఆ తర్వాత మాత్రమే రాజధానిగా అమరావతిని ప్రకటించారని, ఈ విషయంపై సీబీఐతో దర్యాప్తు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రకటన రాగానే చంద్రబాబు కూడా అదే రేంజ్ లో స్పందించారు.

తాము అమరావతిలో ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, దీనిపై మీరు సిబిఐ వేసుకుంటారో, ఎఫ్బీఐ వేసుకుంటారో మీ ఇష్టం అంటూ సవాల్ విసిరారు.

Telugu Chandrababu, Chandrababugive-

విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన విషయాన్ని తాము కూడా దర్యాప్తు చేయిస్తామంటూ చంద్రబాబు వైసీపీ కి సవాల్ విసిరారు.అంతేకాకుండా జగన్ జైలుకు కూడా పంపిస్తాను అంటూ చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.ఇలా వైసిపి, టిడిపి లు ఇన్సైడర్ ట్రేడింగ్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు.అలాగే చంద్రబాబుపైన అనేక కేసులు ఉన్నాయి.

వాటిపై స్టే తెచ్చుకుని విచారణ లేకుండా తప్పించుకుంటున్నారు.వైసీపీ కూడా ఆరోపణలు చేస్తోంది.

ఒకవేళ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేస్తే హాజరు కావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది.

Telugu Chandrababu, Chandrababugive-

ఈ దర్యాప్తులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తేలితే చంద్రబాబు కూడా విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.కానీ తనపై జరిగే దర్యాప్తును చంద్రబాబు ఆషామాషీగా చూస్తూ ఊరుకోరు.రాజకీయంగా వాడుకుంటుంది న్యాయపరంగా ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై ఆలోచిస్తూనే వైసీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.

ఈ లోపు కేంద్రం స్పందన ఎలా ఉంటుందో తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube