టీడీపీలో ఆ ప‌ద‌వులు ఎవ‌రికో… బాబుకు కొత్త త‌ల‌నొప్పి…!  

chandrababu getting new headache,TDP, chandrababu, posts, parliament members, headache, senior leaders, stratagey fire - Telugu Chandrababu, Fire, Headache, New Headache, Parliament Members, Posts, Senior Leaders, Stratagey, Tdp

రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.టీడీపీలో వినూత్న క‌మిటీల‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు.

TeluguStop.com - Chandrababu Getting New Headache

పార్ల‌మెంటు స్థాయిలో క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.ఈ క‌మిటీల‌ను కూడా ఈ నెల 27న ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.అయితే, బాబు వ్యూహం.

TeluguStop.com - టీడీపీలో ఆ ప‌ద‌వులు ఎవ‌రికో… బాబుకు కొత్త త‌ల‌నొప్పి…-Political-Telugu Tollywood Photo Image

పార్టీలో ఫ‌లించేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.ఇప్ప‌టికే అనేక వైరుధ్యాలు, విభేదాల‌తో త‌మ్ముళ్లు తీవ్ర‌స్థాయిలో న‌లిగిపోతున్నారు.

ప‌లితంగా పార్టీ ప‌రిస్థితి కూడా ఇబ్బందిక‌రంగా మారింది.ఈనేప‌థ్యంలో .ఇప్పుడు బాబు తేనెతుట్టెను క‌దిలిస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌.

పార్ల‌మెంటు స్థాయిలో ఏర్పాటు చేసే క‌మిటీలు.

చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు 25 ఉంటాయి.వీటిలో సీనియ‌ర్లు, మాజీ మంత్రులు, పొలిట్ బ్యూరో స‌భ్యులు ఉంటార‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.ఇప్ప‌టికే ఉన్న జిల్లా క‌మిటీలు, మండ‌ల స్థాయి క‌మిటీలు, బూత్ స్థాయి క‌మిటీలు ఉన్నాయి.

వీటిలో ఉన్న నేత‌లే.ఆధిప‌త్య పోరు, వ‌ర్గ పోరు.

అధికార పార్టీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవ‌డం వంటి విష‌యాల‌తో ముందుకు సాగుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.దీంతో పార్టీ ఎక్క‌డిక‌క్క‌డ భ్ర‌ష్టు ప‌ట్టిపోతోంది.

ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి సీనియ‌ర్లను.పొలిట్ బ్యూరో స‌భ్యులు.మాజీ మంత్రులు.పార్ల‌మెంటు స్థాయి క‌మిటీల్లో ఉంటే.

మ‌రింత‌గా ఆధిప‌త్య ధోర‌ణి పెర‌గ‌దా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.అంతేకాదు.

వారు పార్ల‌మెంటు క‌మిటీకే ప‌రిమితై.నిర్ణ‌యాలు తీసుకుంటే.

జిల్లా స్థాయి క‌మిటీలు ఏం చేయాలి? ఈ క‌మిటీలు తీసుకునే నిర్ణ‌యాలు ఎలా పాటించాలి ? అస‌లు ఈ క‌మిటీలు ఉంటాయా ?  ఉండ‌వా ?  ఈ రెండు స్థాయిల్లోనూ నేత‌ల మ‌ధ్య వైరుధ్యం ఏర్ప‌డ‌దా ? అనే ప్ర‌శ్న‌కు బాబు ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.ఇప్ప‌టికిప్పుడు నేత‌ల‌ను సంతృప్తి ప‌ర‌చాల‌నే ఏకైక వ్యూహంతో ఆయ‌న అడుగులు వేస్తున్నారే త‌ప్ప‌.

క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసే వ్యూహం కాద‌ని అంటున్నారు.

#Chandrababu #New Headache #Fire #Posts #Headache

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Getting New Headache Related Telugu News,Photos/Pics,Images..