బాబుకు పెద్ద త‌ల‌పోటు ఈ పంచాయ‌తీ... ప‌రిష్కారం కాదా...!

రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి దూకుడు బ్రేక్ ప‌డాల్సిందేన‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.క‌డ‌ప జిల్లాకు చెందిన ఆది .2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి గెలుపొందారు.అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో ఆయ‌న వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలోకి వ‌చ్చాడు.

 Chandrababu Gets Head With Jammalamaduguconstituency-TeluguStop.com

ఇలా వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌కు బాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చాడు.అయితే, ఆది మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వివాదాస్ప‌దంగానే వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నాడు.ఎస్సీల‌కు శుభ్ర‌త తెలియ‌ద‌ని, వారివి మురికి మొహాల‌ని అని తీవ్ర వివాదం సృష్టించాడు.దీనిని స‌ర్దు బాటు చేయ‌డం నేత‌ల వ‌ల్ల‌కాలేదు.

ఇక‌, ఇప్ప‌డు ఆయ‌న టీడీపీలోనే చిచ్చు పెడుతున్నాడు.త‌న దుందుడుకు మాట‌ల‌తో నేత‌ల మ‌ధ్య విభేదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాడు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ త‌న‌దేన‌ని పేర్కొంటూ వివాదం సృష్టించాడు.ఇది మ‌రింత పెద్ద‌ద‌వుతోంది.ఈ టికెట్‌ను ఆశిస్తున్న‌ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆదితో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.టీడీపీ ఆవిర్భా వం నుంచి రాష్ట్రంలో, జిల్లాలో మంత్రులుకానీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కానీ నియోజకవర్గ టిక్కెట్లు ప్రకటించే సాంప్ర దాయం లేదు.

కానీ, ఆది మాత్రం వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ ఇస్తార‌ని, త‌న గెలుపే ఖాయ‌మ‌ని ఇటీవ‌ల వ్యాఖ్య‌నించాడు.ఈ ప‌రిణామంతో రామ‌సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాడు.

నిజానికి రామ‌సుబ్బా రెడ్డి.వినయ విధేయతలు కలిగిన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా.పార్టీ అధిష్ఠానం చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు.

ఇటీవల మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ఎర్రగుంట్లకు బైక్‌ ర్యాలీ నిర్వహించాడు.ఈ సంద‌ర్బంగా ఎర్రగుంట్ల లో మాట్లాడుతూ.తాను మ‌ళ్లీ జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి గెలుస్తానని చెప్పడం పార్టీటిక్కెట్లు అనౌన్స్‌ చేసినట్లుగా మాట్లాడటంతో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది.దీనిపై స్పందించిన రామ‌సుబ్బారెడ్డి.

అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు త‌న‌ను ఎమ్మెల్సీగా తీసుకున్నంత మాత్రాన ఎమ్మెల్యేగా పోటీలో లేన‌ని కాద‌ని చెప్ప‌డం ద్వారా ఆది దూకుడుకు బ్రేక్ వేసే ప్ర‌య‌త్నం చేశారు సుబ్బారెడ్డి.తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు నుంచి తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే వస్తోందన్నారు.

ప్రజలకు సేవ చేయడం, అధిష్ఠానం వద్ద సమస్య లు లేకుండా నడుచుకోవ‌డ‌మే త‌న‌కు తెలుసున‌ని అన‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యంలో తాను త‌ప్పుకొనేది లేద‌ని చెప్పుకొచ్చాడు.మంత్రి ఆదినారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకునే సమయంలో తాను, తమ కార్యకర్తలు, నేతలు వ్యతిరేకించామన్నారు.

అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన భరోసా మేరకే పార్టీ అధిష్టానం చెప్పినట్లుగా ఇప్పటికీ తాము నడుచుకుంటు న్నామని, అధిష్ఠానంపై తమకు గౌరవం ఉందని అంటున్నారు.మొత్తానికి ఈ ప‌రిణామంతో జ‌మ్మ‌ల‌మ‌డుగు మ‌రో వివాదాస్ప‌ద నియోజ‌క‌వ‌ర్గం అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube