ఇంటా.. బయటా బాబుపై పెరుగుతున్న వ్యతిరేకత..దేశంలో ఏమవుతోంది..?

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ని దిగ్విజయంగా కొనసాగిస్తూ దూసుకుపోతుంటే మరో పక్క నీళ్ళు లేని నదిలో పడవని నడిపే నావికుడిలా చంద్రబాబు ఏమి చేయాలో అర్థం కాకా జగన్ పై ఆరోపణలు చేస్తూ ఎవరో ఒక నాయకుడితో జగన్ పై కామెంట్స్ చేయిస్తున్నారు.

 Chandrababu Get New Head Aches-TeluguStop.com

జగన పై బాబు పెడుతున్న శ్రద్ధ తమ నేతలపై ఆయన పాలనపై గనుకా పెట్టి ఉంటే ప్రజలు చంద్రబాబు పై నమ్మకాన్ని పెట్టుకునే వారు.కానీ పాలనని అటకెక్కించి మరీ అనునిత్యం జగన్ పై తెలుగుదేశం నాయకుడు చేస్తున్న రాజకీయాలు రోజూ చూస్తున్న వారికి విసుగు తెప్పిస్తున్నాయి.

చంద్రబాబు పై ఉన్న నమ్మకాన్ని రోజు రోజు కి తగ్గిస్తున్నాయి.

అయితే ఎప్పుడు నిండు కుండ లా ఉండే చంద్రబాబు కి ఎందుకింత టెన్షన్ అంటే.దానికి కారణం ఒక్కటే జగన్ కు జానాధరణ రోజు రోజుకీపెరిగిపోవడమే జగన్ సంగతి ఇలా ఉంటే…ఇక జగన్ సంగతి పక్కన పెడితే పక్కలో బల్లెంలా మొన్నటి వరకూ బాబు గారికి భజన చేసిన పవన్ కళ్యాణ్ రూపంలో బాబు గారికి మరింత టెన్షన్ ఏర్పడింది.పవన్ వలన జరిగే డ్యామేజ్ చాపకుండా నీరులా చాలా సైలెంట్ గా జరిగిపోతోంది.

పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ప్రజలపై ఉంది కాబట్టే గత ఎన్నికల్లో చంద్రబాబు పవన్ వెనకాల పడ్డారు అంటారు.ఇప్పుడు ఇదే భయం బాబు కి ఏర్పడింది.పవన్ బాబు ని టార్గెట్ చేసుకుని మాట్లాడే ప్రతీ సారి బాబు కి బీపీ హైప్ కి వెళ్తోందట.?

ఇక ఇవన్నీ పక్కన పెడితే ఎన్డీయే నుంచీ బయటకి వచ్చిన తరువాత బాబు ఏమి చేస్తున్నారో సొంత పార్టీ నేతలకి సైతం ఎవరికీ అర్థం కావడంలేదట.దాంతో చంద్రబాబు ఏమి చెప్తే అది చేస్తున్నారు.ఒక పక్క దీక్షలు అంటూ మరో పక్క నిరసనలు అంటూ బాబు హడావిడి చేస్తున్నారు కానీ నియోజకవర్గాలలో సమస్యలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి.

ప్రజలు సమస్యలు తీర్చడం లో మా ఎమ్మెల్యే విఫలం అవుతున్నారు అంటూ మండి పడుతున్నారు ఇలాగే జరిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టం అంటూ బాబు పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట.ఆ.అంతేకాదు నేతల్లో అసంతృప్తి తో పాటుగా బాబు పై నిర్లక్ష్యం కూడా పెరిగిపోయిందట.

తాజాగా చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న ప్రతి టెలీ కాన్-ఫరెన్స్ లకు, జిల్లా మీటింగు లకు కొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేస్తున్నారు…ఎలాంటి కారణాలు ఉన్నా సరే జిల్లా అధ్యక్షుడికి గాని .అధినేతకి గాని ఇంచార్జ్ మంత్రులకి కాని చెప్పడం లేదట…పోనిలే అని బాబు ఊరుకుందామా అంటే పుండు మీద ఈగా బాబు తెగ కి జగన్ పవన్ తెగ టెన్షన్ పెడుతున్నారు.దాంతో సహనం కోల్పోతున్న చంద్రబాబు.

సదరు నేతలపై జిల్లా అధ్యక్షులపై విరుచుకుపడుతున్నారట.

అసలు ఎందుకు హాజరు కాలేకపోయారు, ఏమిటి సమస్య అని అడగడం మానే సిన అధినేత, చెడామడా తిట్టడంతో నేతల్లో మరింత నిర్లక్ష్య ధోరణి పెరిగిపోయిందట.

అయితే, గతంలో ఎప్పుడు చంద్రబాబు సమావేశాలు ఏర్పాటు చేసినా ఒక్కరు కూడా గైర్హాజరయ్యే వారు కాదని.అయితే ఈ మధ్యకాలంలో ప్రత్యక్ష సమావేశాలకి కాదు కదా కనీసం వీడియో కాన్-ఫరెన్సులకు కూడా ఎమెల్యేలు అందుబాటులోకి రావటంలేదట దీంతో చంద్రబాబుని తెలుగుదేశం లో ఉన్న నేతలు ఎవరూ లెక్కచేయడం లేదని అంతగా మాపై పెత్తనం చేలాయించాలి అనుకుంటే మాదారి మేము చూసుకుంటాం అనే పరిస్థితికి పార్టీ వెళ్ళిపోయేలా ఉందని అనుకుంటున్నారట.

ఈ లెక్కలు చూస్తుంటే భవిష్యత్తులో టీడీపిలో భారీ మార్పులు జరగడం తధ్యం అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube