నందమూరి తారకరత్నకి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.హాస్పిటల్ వద్ద చంద్రబాబు, బాలకృష్ణ తారకరత్న తండ్రి మరియు భార్య కూతురు ఉండటం జరిగింది.
ఈ సందర్భంగా అక్కడి వైద్య సిబ్బందితో చంద్రబాబు మాట్లాడటం జరిగింది.ఇదే సమయంలో కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యం పై కీలక అప్ డేట్ ఇచ్చారు.ప్రస్తుతం తారకరత్నని ఐసియు అబ్జర్వేషన్ లో ఉంచారని అన్నారు.
బ్లాక్స్ ఎక్కువగా ఉన్నందున కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు తెలియజేశారు.

తారకరత్న త్వరగా కోలుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.వైద్యులు ఏ చికిత్స చేయాలో ఆ దిశగా నిర్ణయాలు తీసుకుని.వైద్యం అందించనున్నట్లు చంద్రబాబు వివరించారు.
తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మీడియాతో స్పష్టం చేశారు.ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రి వద్ద చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు మరియు నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు.
రేపు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ రానున్నారు.నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.
