అన్న గారిని మ‌ర‌చిన చంద్ర‌బాబు

ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌క అన్న క్యాంటీన్ల ఏర్పాటు విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ప‌రిస్తితి చిత్త శుద్ధి లేని శివ పూజ చేస్తున్న‌ట్టుగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్రంలో పేదలు, నిరుపేద‌లు, కార్మికులకు మంచి ఆహారం అందించే దిశ‌గా అన్ని ప్ర‌ధాన ప్రాంతాల్లోనూ ఎన్‌టీఆర్ అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దీనిపై ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఘ‌న విజ‌యం సాధించారు.త‌ర్వాత ఏడాదికి కానీ, ఆయ‌న అన్న‌క్యాంటీన్ల‌పై దృష్టి పెట్ట‌లేదు.

 Chandrababu Forgotten About Anna Canteens-TeluguStop.com

వాస్త‌వానికి త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత కూడా ఎన్నిక‌ల హామీ మేర‌కే అమ్మ క్యాంటీన్ల‌ను పెద్ద ఎత్తున ప్రారంభించారు.కేవ‌ల ఒక రూపాయికే ఇడ్ల‌, రూ.5 కే సాంబార‌న్నం వంటివి త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున స‌క్సెస్ అయ్యాయి.మ‌రోసారి అమ్మ అధికారంలోకి వ‌చ్చేందుకు ఈ క్యాంటీన్లు ఎంత‌గానో దోహ‌ద ప‌డ్డాయంటే వీటి నిర్వ‌హ‌ణ‌కు అక్క‌డి ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోందో అర్ధ‌మ‌వుతుంది.

ఇదే ఫార్ములాను ఇక్క‌డా అమ‌లు చేయాల‌ని బాబు నిర్ణ‌యించారు.

అయితే, అనివార్య నిధుల స‌మ‌స్య‌, నిర్వ‌హ‌ణ స‌మ‌స్య‌లు ఆయ‌న‌ను వెంటాడాయ‌ని స‌మాచారం.ఇక, ఎట్ట‌కేల‌కు గ‌త ఏడాది ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రి ప‌రిటాల సునీత స‌హా మంత్రులు పీ నారాయ‌ణ త‌దితరులు త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై వెళ్లి అక్క‌డ అమ‌లు జ‌రుగుతున్న అమ్మ క్యాంటీన్ల‌ను ప‌రిశీలించి వ‌చ్చారు.

దీంతో ఏపీలో తొలుత ఎంపిక చేసిన విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, తిరుప‌తి వంటి ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.ఈ నేప‌థ్యంలోనే తొలిద‌శ ప‌రిశీల‌న కూడా పూర్త‌యింది.

అయితే, ఏమైందో ఏమో మ‌ళ్లీ ఈ ప్ర‌తిపాద‌న కుంటుప‌డింది.ఇక‌, ఇప్పుడు రెండేళ్ల‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్న నేప‌థ్యంలో బాబు దృష్టి అన్న క్యాంటీన్ల‌పైకి మ‌ళ్లింది.

ఈ క్ర‌మంలో మ‌రోసారి ఆయ‌న అధ్య‌య‌నం పేరిట ఓ బృందాన్ని త‌మిళ‌నాడు పంపుతున్నారు.పోనీ.

ఇప్ప‌టికైనా అన్న క్యాంటీన్ల‌కు ఓ రూపం వ‌స్తే.మంచిదేన‌నే టాక్ వినిపిస్తోంది.

ఏం జ‌రుగుతుందో చూడాలి.మొత్తానికి చంద్ర‌బాబు ఈ విష‌యంలో అంత శ్ర‌ద్ధ చూపించ‌డం లేద‌ని అనిపిస్తోంది.

కేవ‌లం ఎన్నిక‌ల్లో హాంగామా కోస‌మే అన్న‌గారి పేరును వాడుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది.మ‌రి ఇప్ప‌టికైనా బాబు రియ‌లైజ్ అవుతారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube