గుడివాడ మీద ఫోక‌స్ పెట్టిన చంద్ర‌బాబు.. కొడాలి నానిని ఓడించేందుకు కొత్త ప్లాన్‌..

ఏపీలో ఇప్పుడు టీడీపీ మీద వైసీపీ నుంచి వ‌రుచుకు ప‌డే వారిలో ప్ర‌ధానంగా వినిపించే పేరు కొడాలి నాని. చంద్ర‌బాబు లేదా లోకేష్ పేరు ఎత్తితేనే ఆయ‌న ఒంటికాలిమీద లేస్తుంటారు.

 Chandrababu Focuses On Gudivada New Plan To Defeat Kodali Nani, Kodali Nani, Cha-TeluguStop.com

చాలా దారుణ మైన కామెంట్లు చేస్తూ రెచ్చ‌గొడుతుంటారు.అందుకే ఆయ‌న మీద‌ టీడీపీ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం మీద ఉంది.

ఈ సారి ఎలాగైనా నానిని ఓడించాలంటూ క‌సి మీద ఉంది టీడీపీ.ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు కూడా ఆయ‌న విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉంద‌ని తెలుస్తోంది.

ఆయ‌న్ను ఓడించేంద‌కు ప‌క్కా ప్లాన్ కూడా వేస్తున్నారంట చంద్రబాబు.మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల కంటే కూడా గుడివాడ మీదే స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానిఇ గుడివాడలో నానిని ఢీకొట్టేందుకు టీడీపీకి బలమైన క్యాండెట్ లేర‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.గ్రౌండ్ లెవ‌ల్లో ప‌ట్టులేకుండా నానిని ఓడించాలంటే క‌ష్టం.గ‌తంలో 2004తో పాటుగా 2009లో జ‌రిగిన వ‌రుస ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి నాని గెలిచాడు.ఆ స‌మ‌యంలో టీడీపీకి చాలా ప‌ట్టు ఉండేది గుడివాడ‌లో.

కానీ నాని వైసీపీలోకి జంప్ చేసేసిన త‌ర్వాత ఆయ‌న వెంటే టీడీపీ కేడ‌ర్ కూడా వైసీపీలోకి వెళ్లిపోయింది.ఇక వైసీపీ నుంచి కూడా వ‌రుస‌గా రెండుసార్లు గెలిచారు.

గత ఎన్నికల్లోనే టీడీపీ నుంచి అవినాష్ ను పోటీ చేయించినా ఓట‌మి త‌ప్ప‌లేదు.

Telugu Ap, Chandrababu, Kodali Nani, Lokesh-Telugu Political News

అందుకే ఈసారి స‌మాజిక వ‌ర్గీక‌ర‌ణ వేసుకుని మ‌రీ రంగంలోకి దిగుతున్నారు.గుడివాడ‌లో కాపు ఓట్లు చాలా ఎక్కువ‌.అందుకే ఈసారి కాపు వర్గానికి ఓ బ్రాండ్ గా వెలుగు వెలుగుతున్న‌టువంటి వంగవీటి రాధాను తీసుకురావాల‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబు క‌మ్మ కాబ‌ట్టి ఆటు క‌మ్మ ఓట్ల‌తో పాటు ఇటు కాపు ఓట్లు కూడా ప‌డితే టీడీపీ క‌చ్చితంగా గెలిచే ఆస్కారం ఉంటుంద‌ని అనుకుంటున్నారంట‌.ఇక రాధాను బ‌రిలోకి దించితే జిల్లా వ్యాప్తంగా ఉన్న వంగవీటి రంగా అభిమానులు కూడా టీడీపీవైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారంట చంద‌బ్రాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube