బీజేపీ దెబ్బ బాబు కి గట్టిగానే తగిలిందా...   Chandrababu Fire West Godavari TDP ZP Chairman     2018-01-13   19:12:21  IST  Bhanu C

గత కొన్ని రోజులుగా ఏపీలో బీజేపి ఎమ్మెల్యే.. మినిస్టర్ అయిన మాణిక్యాలరావు ఏపీ సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో విమర్సాలకి దిగుతూ టిడిపిని అనరాని మాటలు అన్నీ అనేశారు..పార్టీలో గుర్తింపు లేకుండా చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు..టిడిపికి మిత్ర భంధం అనే భేదం కూడా లేదు అంటూ ఫైర్ అయ్యారు…దానికి తగ్గట్టుగానే పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మెన్ బాపిరాజు, మున్సిపల్ ఛైర్మన్ లు ఇద్దరు కూడా తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు..ఆఫ్ట్రాల్ ఫోటోగ్రాఫర్ అంటూ మంత్రిపై ఫైర్ అయ్యారు.. బాపిరాజు సీన్ కట్ చేస్తే..

చంద్రబాబుకి దొరక్క దొరక్క మోడీ అపాయింట్మెంట్ దొరికింది సంవత్సర కాలంగా మోడీ దర్సనం కోసం వేచి చుసిన బాబు కి ఇంతలో ఆ యోగం రానే వచ్చింది..ప్రధానిని బాబు కలిశారు..చంద్రబాబు తిరిగి విజయవాడ చేరుకోగానే మాణిక్యాలరావు పై బాపిరాజు,తాడేపల్లి గూడెం మున్సిపల్ చైర్మెన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారని… ఇద్దరు మంత్రులు పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్మలతో కూడిన ఓ కమిటీని వేసి తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అని చెప్పారని మీడియాలో హల్చల్ చేసింది.

అసలు ఈ గొడవలు అన్నీ చంద్రబాబు మోడీ ని కలవడానికి వెళ్ళే ముందు జరిగాయి..కట్ చేస్తా కట్ చేస్తా అని మంత్రి అన్న మాటలు అవేవో సెన్సార్ సుటింగ్ లా మీడియాలో హల్చల్ చేశాయి..కానీ ఆసమయంలో ఇక్కడే ఉన్న బాబు కి మాత్రం తెలియకుండా పోయిందా..?..ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఢిల్లీ నుంచీ వచ్చిన తరువాత ఎందుకు మాట్లాడారు..అంటే అక్కడ బీజేపి సెగ చాలా గట్టిగానే తగిలింది అందుకే బాబు వచ్చీ రాగానే మంత్రిపై అవ్వకులు చవాకులు పన్ని న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను అని తెలిపారు అని భావిస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.