కేంద్రం మోసం చేసింది..మొదటిసారిగా గళం విప్పిన బాబు   Chandrababu Fire On BJP     2018-02-22   23:53:31  IST  Bhanu C

ఏపీ సీఎం మొదటిసారిగా గళం విప్పారు..ఇన్నిరోజులుగా ఎప్పడు కేంద్రం పై డైరెక్ట్ గా విమర్శలు చేయని చంద్రబాబు. ఒక్కసారిగా కేంద్రం పై ఉన్న కోపాన్ని ప్రదర్శించారు..ఏపీ ప్రజలని కేంద్రం మోసం చేసింది అంటూ కోట్లాది మంది తెలుగు ప్రజల గొంతు వినిపించారు..ఎప్పుడెప్పుడు చంద్రబాబు మాట్లాడుతారా అని ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే చంద్రబాబు ఒక్క సారి గళం వినిపించారంటే..ఇక మోడీ కి మూడినట్టేనని అర్థం చేసుకోవచ్చు. వివరాలలోకి వెళ్తే..

అనంతపురం జిల్లా పర్యటనలోఉన్న చంద్రబాబు మాట్లాడారు విభజన హామీలపై కేంద్రం సకాలంలో సాయం చేసుంటే ఏపీ ఇంకా అభివృద్ధి చెంది ఉండేది..ఎక్కడికక్కడ పనులు ఆగిపోవడానికి కారణం కేంద్రమే అంటూ ఫైర్ అయ్యారు.. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు…ఏపీ కి అన్యాయం చేయబోము అంటూనే అన్యాయం చేశారని అరుణ్ జైట్లీ పై ధ్వజమెత్తారు..ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేని పార్టీలు సైతం చంద్రబాబు వల్లే ఇదంతా జరిగింది అంటూ నన్ను టార్గెట్ చేస్తూ మీ ముందుకు వస్తున్నారు ఇది నిజమా అంటూ ప్రశ్నించారు.

అయితే కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే సంక్షేమ పథకాలను ఆపబోమని చంద్రబాబు తెలిపారు…కేంద్రం మన ఆత్మగౌరావాన్ని కించపరిచే విధంగా నడుచుకుంటే తగిన బుడ్డి చెప్పడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు…శాంతి భద్రతలు సరిగా లేకపోతే పెట్టుబడులు రావని అందుకే శాంతియుతంగా అందోళనలు చేయాలని అన్నారు చంద్రబాబు..ప్రత్యేకహోదా ఆందోళనల సాకుతో కొంతమంది గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.వారి టార్గెట్ ఏపీ కి నష్టం వాటిల్లెలా చేయడమే..తద్వారా రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారూ..జగన్ న్యూస్ పేపర్ ఎప్పుడు అబద్దాలే చెప్తుంది..ఎందుకంటే వారి నాయకుడు కూడా అబద్దపు నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు..ఏపీని అభిరుద్ది చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నానని కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాని అన్నారు చంద్రబాబు..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.