కుప్పం సంగతి సరే ! మంగళగిరి పరిస్థితి ఏంటి ?  

టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపు తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం పై విరామం లేకుండా పోరాటం చేస్తున్నారు.

 Chandrababu Facing Troubles Choosing Nara Lokesh Constituency Mangalagiri Or Kup-TeluguStop.com

అనేక ప్రజా సమస్యలను ఎత్తిచూపడం తో పాటు , అభివృద్ధి సంక్షేమం విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమవుతున్న తీరును ప్రజలకు వివరించడంలో బాబు సక్సెస్ అవుతున్నారు.ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రభావాన్ని తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది .దీనిలో భాగంగానే కుప్పం నియోజకవర్గం లో చంద్రబాబు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ ప్రభావమే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కనిపించింది.

టిడిపి ఖాతాలో పడాల్సిన కుప్పం మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడింది.
  అంతేకాక రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం గుర్తించిన బాబు గత కొద్దిరోజులుగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ, పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు పార్టీకి పెద్దగా కలిసిరాని కొంతమంది సీనియర్ నాయకుల ప్రభావం తగ్గించి నియోజకవర్గంలో కొత్త నేతలకు అవకాశం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు.

బాబు పర్యటన తర్వాత కుప్పం నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు నాయకులు యాక్టీవ్ అయ్యారు.  రాబోయే ఎన్నికల్లో తనకు ఇబ్బందులు లేకుండా చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు.ఈ సందర్భంగా బాబు కుమారుడు లోకేష్ వ్యవహారం చర్చకు వస్తోంది.2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ ఓటమి చెందారు.
 

Telugu Ap, Chandrababu, Constituency, Kuppam, Mangalagiri, Lokesh, Tdp-Political

మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ఇటీవల చంద్రబాబు చేపట్టిన దీక్ష సందర్భంగా లోకేష్ ప్రకటించారు.అయితే ఈ నియోజకవర్గం ను లోకేష్ పెద్దగా పట్టించుకోకపోవడం , ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉండటం తో 2024 ఎన్నికల్లో లోకేేష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా, ఇబ్బందికర పరిస్థితితులు ఎదురవుతాయి అన్నట్టుగానే పరిస్థితి నెలకొంది.చంద్రబాబు మాదిరిగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించి ఇక్కడ మండల , గ్రామస్థాయి నుంచి తనకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపగలిగితేనే 2024 ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశం ఏర్పడుతుంది అనే సూచనలు ఎన్నో వస్తున్నాయి. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube