ఆ కుంభకోణంలో బాబు ఇరుక్కుపోయినట్టేనా ?

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ అనేక అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెస్తోంది.

 Chandrababu Facing Problems With Esi Scam-TeluguStop.com

ఇప్పటికే చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రెటరీ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించి సంబంధించిన ఆధారాలను ఐటీ శాఖ సంపాదించినట్టు ప్రచారం జరుగుతోంది.ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, కీలక నేత అహ్మద్ పటేల్ కూడా చిక్కుకున్నారు.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఈ ఎస్ ఐ మందులు కొనుగోలు వ్యవహారంలోని అనేక అక్రమాలు జరిగినట్టుగా ఆధారాలు బయటపడ్డాయి.

ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు మరో మంత్రి సాక్ష్యాధారాలతో సహా ఇరుక్కున్నారు.

అయితే ఈ స్కామ్ వెనుక చంద్రబాబు హస్తం ఉందని గట్టిగానే ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా కేసులో ఇరుక్కుంటారని అచ్చెన్నాయుడు తో పాటు బాబు కూడా జైలుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ వ్యాఖ్యలన బలపరుస్తూ ఏపీ మంత్రి జయరాం కూడా సంచలన విషయాలు బయట పెట్టారు.బాబు హయాంలో ఈఎస్ఐ లో 300 కోట్ల అవినీతి జరిగిందని, త్వరలోనే దీనికి సంబంధించి అన్ని విషయాలు బయటపెడతామని అన్నారు.

-Telugu Political News

ఈ స్కామ్ లో చంద్రబాబుతో పాటు కార్మిక శాఖ మంత్రులు పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, చంద్రబాబు తదితరులు జైలుకు వెళ్తారు అని హడావుడి కొద్ది రోజులుగా జరుగుతోంది.టిడిపి హయాంలో ఏం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈఎస్ ఐ లేని షెల్ కంపెనీలు క్రియేట్ చేసి – నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందని సమాచారం.రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ ఐ డైరెక్టర్లు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారట.ఈఎస్ ఐకి చెందిన రవికుమార్ , రమేష్ , విజయలు మందుల పరికరాలను 135శాతం అధిక ధరకు టెండర్లలో చూపించారని తేలినట్లు తెలుస్తోంది.

నకిలీ కొటేషన్లు షెల్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది.మొత్తంగా చూస్తే ఈ కేసుల్లో చంద్రబాబు బాగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube