బాబు కి సొంత జిల్లాలోనే షాక్ తప్పదా..  

వంద గొడ్లని తిన్న ఒక రాబందు ఒక్క గాలి వానకి చిత్తు చిత్తు అయ్యిందట..ఇప్పుడు ఇదే సామెత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సరిగ్గా సరిపోతుంది అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలకి తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ కి వచ్చే కాలం అంతా గడ్డు పరిస్థితే అంటున్నారు..అయితే ఈ పరిస్థితి ఏపీ మొత్తం ఉందని అంటుంటే చంద్రబాబు సొంత జిల్లాలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని తెలుస్త్తోంది..ఇంతకీ బాబు ఇలాఖాలో ఏమి జరుగుతోంది..? అనే వివరాలలొకీ వెళ్తే..

Chandrababu Facing Problem From Chevireddy In Chandragiri-

Chandrababu Facing Problem From Chevireddy In Chandragiri

చంద్రబాబు సొంత జిల్లా చిత్తురూలో ని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని ఇక్కడ నుంచి 2014లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి టీడీపీ అభ్యర్ధుల కంటే కూడా వేగంగా ప్రజలలో తిరగడం వారి సమస్యలని సావధానంగా వినడం తలలో నాలికలా ఉండటం తో టీడీపీ కి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది అంటున్నారు..అయితే ఈ క్రమంలోనే ఆమె డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాలో రూ.2000 చొప్పున జమచేయడంతో మరింత దుమారం రేగిపోయింది..దాంతో టీడీపీ ఈ విషయాన్ని తమకి అనుకూలంగా మలుచుకోవాలని అనుకున్నారు కానీ వారి వారి ఖాతాలలో డబ్బు గురించి ప్రశ్నిస్తే డ్వాక్రా వారికి దూరం అవుతారు అనే విషయం మరిచి రచ్చ రచ్చ చేశారు.

అయితే చెవిరెడ్డి భార్య చేసిన ఈ పని ఎన్నికల ముందు ఓట్లని కొనుగోలు చేసే విధంగా ఉందని అన్ని పార్టీలు ఖండించాయి..ఇదిలాఉంటే చెవిరెడ్డి పై పోటీ చేసి పరాజయం పాలయిన గల్లా అరుణ కుమారి వచ్చే ఎన్నికల్లో అయినా సరే విజయం సాధించాలని భావిస్తున్నారు..అయితే టీడీపీలో ఆమెకి లోకల్ నేతలు అనుకున్న స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడంతో ఈ సారి గెలుపు విషయంలో ఆమె సందిగ్ధంలో పడ్డారు దాంతో గల్లా బాబు ఇచ్చిన భాద్యతల నుంచీ తప్పుకోవడంతో పులవర్తి నాని అనే వ్యాపారవేత్తకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేశారు.

Chandrababu Facing Problem From Chevireddy In Chandragiri-

అయితే ఈ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు ఎందుకంటే గల్లా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు ఇప్పుడు లోకేష్ ఎంపిక చేసిన నేతపై కూడా పెదవి విరుస్తున్నారు..దాంతో ఇప్పుడు చంద్రగిరిలో టీడీపీ పరిస్థితి అయోమయంగా ఉంది దాంతో గల్లా తప్ప మరెవరిని బాబు రంగంలో దింపే అవకాశం లేదని అంటున్నారు అయితే గల్లా ని పోటీలో ఉంచినా సరే చంద్రగిరిలో టీడీపీ గెలుపు కష్టమే అంటున్నారు..రాజకీయ పరిశీలకుల అంచనాల మేరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ లో ఉన్న వ్యతిరేకులే చెవిరెడ్డి ని దగ్గర ఉండి గెలిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు..దీన్ని బట్టి చూస్తే చంద్రగిరి నియోజకవర్గం లో టీడీపీ అడ్రస్ గల్లంతే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..మరి చంద్రబాబు సొంత జిల్లాలో మరో మారు చంద్రగిరిని జారవిడుచుకుంటార లేదా అనేది వేచి చూడాల్సిందే.