బాబుకి హ్యాండ్ ఇచ్చిన ప్రధాన ప్రాంతీయ పార్టీలు! అంతా ఎగ్జిట్ పోల్స్ మాయ  

చంద్రబాబుకి ఊహించని విధంగా హ్యాండ్ ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు. .

Chandrababu Face Unexpected Shock From Regional Parties-congress,dmk,jds,mayawati,regional Parties,tdp

ఎ క్షణం ఎగ్జిట్ పోల్స్ లో మళ్ళీ ఎన్డీఎ కూటమి అధికారంలోకి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి ప్రధాని అవుతారు అనే మాట చెప్పాయో అప్పటి నుంచి మోడీ వ్యతిరేకంగా జత కట్టిన ప్రాంతీయ పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా అయిపొయింది. మోడీని ఎంత టార్గెట్ చేసిన ప్రజలు మళ్ళీ అతనికే పట్టం కట్టడానికి సిద్ధం అవుతున్నారని క్లారిటీ తెచ్చుకున్న నేతలు అందరూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కయ్యం పెట్టుకోవడం ఎందుకని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. .

బాబుకి హ్యాండ్ ఇచ్చిన ప్రధాన ప్రాంతీయ పార్టీలు! అంతా ఎగ్జిట్ పోల్స్ మాయ-Chandrababu Face Unexpected Shock From Regional Parties

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటిని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక తాటిపైకి తీసుకొచ్చారు.

అందరిని దగ్గరుండి కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చేందుకు ఒప్పించారు. దానికి తగ్గట్లుగాని విపక్షాలన్నీ ఎన్నికల పోలింగ్ ముందు వరకు కాంగ్రెస్ కి సపోర్ట్ గా చంద్రబాబు ఏం చెబితే అదే చేసాయి. ఇక కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని అయిపోవాలని మాయావతి, మమతా బెనర్జీ లాంటి మహిళా నేతలు కళలు కన్నారు.

అయితే ఎగ్జిట్ పోల్స్ వీళ్ళ ఆశలపై నీళ్ళు జల్లాయి. దీంతో కాంగ్రెస్ తో కలిసి వెళ్తే అసలుకె మోసం వస్తుందని నిర్ణయించుకొని తాజాగా బీజేపీయేతర పక్షాల బేటీకి ప్రధాన నాయకులు డుమ్మా కొట్టి పార్టీ ప్రతినిధులని మాత్రమే పంపించారు. ఇది ఓ విధంగా చంద్రబాబుకి ఊహించని దెబ్బ అని చెప్పాలి. మరో రెండు రోజులలో ఫలితాలు రానున్న నేపధ్యంలో చంద్రబాబు భవిష్యత్తు కోసం ఇప్పుడు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాడు అనేది చూడాలి.