వైసీపీని ఎదుర్కొనేదెలా ? టీడీపీ కి క్లారిటీ రాలేదా ?  

Chandrababu Face To Ysrcp Leaders And Members-ap Assembly,chandrababu,tdp Leaders,ys Jagan,టీడీపీ అధినేత చంద్రబాబు,వైసీపీ

ఓడలు బళ్ళు .బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కి బాగా తెలిసొచ్చినట్టు ఉంది.

ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది కేవలం 23 స్థానాలకే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదీ కాకుండా మొన్నటివరకు తాను ఏలిన సింహాసనంపై జగన్ కూర్చోవడం , తాను ప్రతిపక్షంలో ఉండడం బాబు కి అస్సలు నచ్చడంలేదు. అయినా తప్పదు మరి ఎందుకటంటే ఈ ఐదేళ్లవరకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జగన్ ఆ కుర్చీలోనే ఉంటాడు. టీడీపీ అధికారంలో ఉండగా జగన్ పై, వైసీపీ నాయకులపై చంద్రబాబు చేయించిన మాటల యుద్దాలు కూడా మామూలువి కాదు.

అవకాశం దొరికితే చాలు వైసీపీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించేవారు. ప్రస్తుతానికి ఎక్కడి నేతలు అక్కడే గప్ చిప్ అయిపోయారు.

వైసీపీని ఎదుర్కొనేదెలా ? టీడీపీ కి క్లారిటీ రాలేదా ? -Chandrababu Face To YSRCp Leaders And Members

ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి అంటే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ని చంద్రబాబు ఎదుర్కోగలరా ? ఇక బాబు అయితే తమ పార్టీ ఎమ్యెల్యేలకు చేస్తున్న దిశానిర్దేశం ఏంటి అంటే ‘నేనూ అసెంబ్లీలోనే వుంటాను. అయినా కానీ, నేను మాట్లాడేదానికంటే మీరే ఎక్కువ మాట్లాడాలి.

అధికార పక్షాన్ని నిలదీసే విషయంలో అస్సలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. కొంచెం అలసత్వం ప్రదర్శించామంటే తొక్కి పడేస్తారు.’ అంటూ పార్టీ ఎమ్యెల్యేలకు క్లాస్ పీకుతున్నారట.అంతకు ముందు మాత్రం కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దాం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మాటలన్నీ పక్కన పెట్టేసారు.

వైసీపీకి సంబంధించి ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడాలని చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలకు కాల్స్ పీకుతున్నారట. ఎంత గొంతు చించుకున్నా ఏమి ప్రయోజనం ? అసెంబ్లీలో టీడీపీకి ఉన్నది చంద్రబాబుతో కలిసి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అధికార పార్టీ ఎమ్యెల్యే ముందు వీరి వాదన అరణ్య రోదన కిందే ఉంటుంది అన్నది వాస్తవం. ఇక టీడీపీలో ఒక వెలిగినవారు ఆ తరువాత వైసీపీ లో చేరడం కీలక పదవులు పొందడం బాబు కి పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది.

మరి ఈ ఐదేళ్లపాటు అధికార పార్టీని ఏ విధమైన వ్యూహాలతో ఎదుర్కుంటారో చూడాలి.