వైసీపీని ట్రాప్‌లో ప‌డేసేందుకు చంద్ర‌బాబు విశ్వ ప్ర‌య‌త్నాలు..

రాజ‌కీయాల్లో ఎప్పుడూ కూడా ప్ర‌త్య‌ర్థుల ట్రాప్ లో ప‌డ‌కూడ‌దు.వారు ఎన్ని విమ‌ర్శ‌లు, లేదంటే ఆరోప‌ణ‌లు చేస్తున్నా కూడా దాన్ని ఎంత వ‌ర‌కు స్పందించి వ‌దిలేయాలో అంత వ‌ర‌కే స్పందించాలి.

 Chandrababu Efforts To Trap Ycp Details, Chandrababu, Ycp , Ap Politics, Tdp Mps-TeluguStop.com

పైగా దాన్ని డైవ‌ర్ట్ చేసేసి ఇత‌ర విష‌యాల మీద‌కు జ‌నాల ఫోక‌స్ మ‌ళ్లే విధంగా చేసుకోవాలి.అప్పుడే మ‌నుగ‌డ అనేది సాధ్యం అవుతుంది.

అంతే గానీ ప్ర‌త్య‌ర్థుల ట్రాప్‌లో ప‌డితే మాత్రం చివ‌ర‌కు అధికారాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది.ఈ విష‌యం టీడీపీని చూస్తేనే అర్థం అవుతోంది.

ఎందుకంటే గతంలో ఆ పార్టీ వైసీపీ ట్రాప్ లో ప‌డి చివ‌ర‌కు అధికారానికి దూర‌మ‌యింది.

చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత వైసీపీ ట్రాప్ లో పడి దారుణ‌మైన ఓట‌మి పాల‌య్యారు.

కాగా ఈ విష‌యాన్ని చిన్న స్థాయి వారు చెప్ప‌లేదండోయ్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో చెప్పారంటేనే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.అయితే ఇప్పుడు చంద్ర‌బాబు ఓ కొత్త ప్లాన్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

వైసీపీ ఎలాగూ ఎన్డీఏలో చేర‌లేదు కేవ‌లం బ‌య‌టి నుంచి మాత్ర‌మే స‌పోర్టు చేస్తోంది.కాబ‌ట్టి ఎలాగైనా వైసీపీని బీజేపీ నుంచి దూరం చేయాల‌నే భావ‌న‌లో ఉన్నారు చంద్ర‌బాబు.

Telugu Amit Shan, Ap Cm Jagan, Ap, Central Bjp, Chandrababu, Narendra Modi, Tdp

ఇందుకోసం నిత్యం ప్రధాని మోదీ, అలాగే అమిత్ షాకు ద‌గ్గ‌ర‌య్యేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.చంద్ర‌బాబు త‌ర‌ఫున టీడీపీ ఎంపీలు కేంద్ర పెద్ద‌ల‌ను క‌లుస్తున్నారు.అయితే జగన్ ను చూస్తుంటే మాత్రం అంత ఈజీగా చంద్ర‌బాబు ట్రాప్ లో ప‌డేలా క‌నిపించ‌ట్లేదు.ఎందుకంటే ఆయ‌న మొద‌టి నుంచి బీజేపీతో అంతే దూరాన్ని కొన‌సాగిస్తున్నారు.

వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా కేంద్ర పెద్ద‌ల‌ను క‌లుస్తూ వారిని ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు.రాష్ట్రం వ‌ర‌కు ఎలా ఉన్నా కూడా కేంద్రంలో మాత్రం దోస్తీని కంటిన్యూ చేస్తున్నారు జ‌గ‌న్‌.

చూడాలి మ‌రి చంద్ర‌బాబు ప్లాన్లు ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube