ఏపీలో దీక్ష‌.. తెలంగాణ‌లో వేడుక‌.. బాబు డ‌బుల్ గేమ్‌

జూన్ 2న న‌వ నిర్మాణ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేశారు.అంతేగాక ఆయ‌న కూడా ఇందులో పాల్గొన‌బోతున్నారు.

 Chandrababu Double Game-TeluguStop.com

రాష్ట్రాన్ని రెండుగా విభ‌జించి ఏపీకి అన్యాయం చేసింద‌ని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జమెత్తుతున్న ఆయ‌న‌.ఈసారి బీజేపీని టార్గెట్ చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

ఇదంతా అటుంచితే ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాలంటూ ఆదేశాలు జారీచేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఎందుకంటే.

ఏపీలో తెలంగాణ ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ దీక్ష‌లు చేపడుతూ.మ‌రోప‌క్క తెలంగాణ ఏర్పాటు వేడుకలు నిర్వ‌హించాల‌ని తెలంగాణ నేత‌ల‌కు చెప్ప‌డం చూస్తుంటే.

చంద్ర‌బాబు మ‌ళ్లీ తన ట్రేడ్ మార్క్ అయిన రెండుక‌ళ్ల సిద్ధాంతాన్ని తెర‌పైకి తీసుకొచ్చార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

క‌ర్ర విర‌గ‌కూడ‌దు.పాము చావ‌కూడ‌దు.ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలికి బాగా స‌రిపోయే మాట‌.

ఒక‌ప్ప‌టి రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి నేటి వ‌ర‌కూ దానిని విడిచిపెట్ట‌కుండా మెయిన్‌టెన్ చేసుకుంటూ వ‌స్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.ఎందుకంటే విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూనే.

ఏపీలో పార్టీపై వ్య‌తిరేక‌త రాకుండా ఇక్క‌డి ప్ర‌యోజ‌నాలు కూడా ముఖ్య‌మేనంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమార‌మే రేపాయి.ఇప్పుడు మ‌ళ్లీ ఇదే త‌ర‌హా వ్య‌వ‌హార శైలితో వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఒకనాటి తనకే ప్రత్యేకమైన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మళ్లీ టీడీపీ అధ్యక్షుడు తెరమీదకు తెచ్చారు.గతంలో ఈ విధానాన్ని రాష్ట్ర విభజన విషయంలో అమల్లో పెట్టగా ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అమలులో పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో తెలంగాణ పాట.ఆంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రకు అనుకూలమైన పాట పాడుతూనే ఉన్నారని అది తాజాగా తార‌స్థాయికి చేరిందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు.జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల‌ను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించాలని ఎల్.రమణ అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ స్వయంగా చంద్రబాబు.నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్నారు.8 జిల్లాల్లో మహా సంకల్ప బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు.రాష్ట్ర విభన రోజైన జూన్ 2నుంచి నవని ర్మాణ దీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

వారం రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షకు సంబంధించి గురువారం మార్గ దర్శకాలు విడుదల చేసింది.

పంచాయతీ లు, వార్డుల స్థాయిలో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి 5 గంటల వరకు వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహిం చబోతున్నారు.జిల్లా, మండల స్థాయిలో, మున్సిపల్ పరిధిలో ఆయా కమిటీలు పర్యవేక్షించాలి.

ప్రోగ్రామ్ మేనేజ్ మెం ట్ కమిటీల ఏర్పాటు బాధ్యత కలెక్టర్లకు అప్ప‌గించారు.వివిధ అంశాలపై చర్చించడమేగాక‌ 2018 -19 ఆర్ధిక సంవత్స రానికి సంబంధించి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.

సాంస్కృతిక కార్యక్రమా లతో పాటు కూచిపూడి నృత్యం జానపద నృత్యం, పాటలు, సంగీతం, కవులతో భేటీలను నిర్వహించాలి.వ్యాసరచన‌, ఉపన్యాస పోటీలు నిర్వహించ నున్నారు.

మ‌రి ఒక‌వైపు వేడుక‌లు చేస్తూనే.మ‌రోవైపు దీక్ష‌ల పేరిట ఇలా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేంట‌నే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube