ఉక్కు కావాలంటారు.. బొక్క‌లిర‌గ‌తీస్తారు.. బాబు పాల‌న‌లో ద్వంద్వ నీతి..!

అవును! మేధావులు, విజ్ఞులు సైతం ఇలాంటి ప్ర‌శ్న‌లే సంధిస్తున్నారు.ఒక ప‌క్క రాష్ట్రానికి మ‌రో ఉక్కు ఫ్యాక్ట‌రీ(ఇప్ప‌టికే విశాఖ‌లో ఒక‌టి ఉంది కాబ‌ట్టి) రావాల‌ని సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు కంటున్నార‌ని టీడీపీ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు.

 Chandrababu Double Game Over Kadapa Steel Factory-TeluguStop.com

అంతేకాదు, ఇది విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల్లో ఒక‌టి కాబ‌ట్టి దీనిని నెర‌వేర్చ‌డం కోసం అంద‌రూ క‌లిసి పోరాడాల‌ని పిలుపుకూడా ఇస్తున్నారు.అయితే, మాట‌ల్లో ఉన్న వ్య‌వ‌హారం చేత‌ల్లోకి వ‌చ్చే స‌రికి మాత్రం మారిపోతోంది.

విష‌యంలోకి వెళ్తే.గ‌త ఐదు రోజులుగా క‌డ‌ప జిల్లా ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం అట్టుడుకుతోంది.

టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆమ‌ర దీక్ష‌ల‌కు కూడా దిగారు.దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

అయితే, ఈ ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం రాష్ట్రంలోని వైసీపీ స‌హా ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాలు సైతం ముందుకు క‌దిలాయి.

త‌మ త‌మ పంథాల్లో ప్ర‌జా ఉద్య‌మాల‌కు శ్రీకారం చుట్టాయి.మ‌రి ఆది నుంచి రాష్ట్ర ప్ర‌యోజనాల‌విష‌యంలో త‌మ‌కే క్రెడిట్ ద‌క్కాల‌ని భావిస్తున్నారో ఏమో చంద్ర‌బాబు.ఎక్క‌డిక‌క్క‌డ విప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను అణిచి వేస్తున్నారు.

తొలుత ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఉద్య‌మించిన స‌మ‌యంలో వేస్ట్ అని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు .జ‌గ‌న్ విద్యా సంస్థ‌ల‌ను ఎంచుకుని చేసిన యువ భేరి ప్ర‌చారాన్ని కూడా తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌ట్టారు.ఈ యువ‌భేరి వ‌ల్ల ప్ర‌యోజనం లేద‌ని ఆయ‌న ప్ర‌చారం చేయించారు.ఇక‌, ఇప్పుడు క‌డ‌ప‌లో ఉక్కు కోసం ఉద్య‌మిస్తున్న వారిని అరెస్టు లు చేయించా రు.తాజాగా క‌డ‌ప ఉక్కు కోసం క‌డప జిల్లాలో వైసీపీ, కమ్యూనిస్టు పార్టీ నేత‌లు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఉద్య‌మించారు.మ‌రివీరికి ప్ర‌భుత్వం నుంచి సంఘీభావం వ‌స్తుంద‌ని ఎవ‌రైనా అనుకుంటారు.

కానీ, దీనికి విరుద్ధంగా ఆందోళ‌న చేస్తున్న నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టులు చేసి పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.పోనీ.నిజానికి ఈ ఫ్యాక్ట‌రీకి సంబంధించిన నిర్ణ‌యం ఢిల్లీలో జ‌ర‌గాల్సి ఉంద‌ని భావిస్తే.దానికి అనుగుణంగానే ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుని ఉండాల్సింది.

కానీ,టీడీపీ నేత‌లు క‌డ‌ప‌లో చేస్తున్న దీక్ష‌కు భారీ ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించి సంఘీభావం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం విప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తివ్వ‌కుండా మ‌రోప‌క్క అణ‌చివేత ధోర‌ణుల‌కు పాల్ప‌డ డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఢిల్లీలోనే ఆందోళ‌న‌లు చేసుకోవాల‌ని బాబు తీర్మానించిన‌ట్ట‌యితే.

ఎంపీ సీఎం ర‌మేష్‌, ఎమ్మెల్సీ బీటెక్ ర‌విలు కూడా ఢి్ల్లీలోనే దీక్ష‌లు చేయాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండదు.బీజేపీ నేత‌లు చెబుతున్న‌ట్టు.

చంద్ర‌బాబు ద్వంద్వ ప్ర‌మాణాలు పాటిస్తున్నార‌న‌డానికి ఇది మ‌చ్చుతున‌క‌గా మారిపోతోంది.మ‌రి ప్ర‌భుత్వానికి ఉక్కు సంక‌ల్పం ఉందా? లేదా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.దీనికి ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube