టీడీపీ టూ వైసీపీ వలసలకు బ్రేక్ ? బాబా మజాకా

టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు అర్థం చేసుకోవాలంటే అది తలలు తిరిగిన రాజకీయ పండితులకు తప్ప, సాధారణ జనాలకు ఏమాత్రం అర్థం కావు.ఆయన ఏ వ్యూహం పన్నినా, అంతిమంగా పార్టీకి , తమకు కలిసి వచ్చే విధంగా ఉండేలా చూసుకుంటారు.

 Chandrababu Devised A Strategy To Prevent Any Party Leaders From Joining The Ycp-TeluguStop.com

ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపికి నిరాశే ఎదురయింది.అధికార పార్టీ వైసీపీ ముందు టిడిపి వ్యూహాలు ఏవి పనిచేయలేదు.

స్థానిక సంస్థలు, మున్సిపల్, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఇలా అన్నిటిలోనూ టీడీపీకి పరాభవమే ఎదురైంది.అయితే టీడీపీకి ఈ రకమైన ఫలితాలు వస్తాయని అధికార పార్టీ వైసీపీ బలం ముందు తాము నిలువలేము అనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.

పైగా ఈ ఎన్నికలలో గెలుపు తమదే అన్నట్లుగానే పార్టీ నేతల్లో ఉత్సాహం తీసుకువచ్చారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టిివ్ గా లేని నాయకులు అందరిలోనూ ఉత్సాహం కల్పించారు.

అయినా మరికొందరు మాత్రం తమకేమి పట్టనట్లు గా వ్యవహరిస్తుండడం , వైసీపీలోకి వెళ్లేందుకు ఇంకొంత మంది నేతలు ప్రయత్నించడం వంటి కారణాలను బాబు గుర్తించారు .అందుకే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో ఎక్కడా బిజెపి,  జనసేన పై విమర్శలు చేయకుండా పూర్తిగా వైసీపీ ని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి పరోక్షంగా జనసేన తో పొత్తు పెట్టుకుని అనేక సీట్లలో పోటీకి దిగింది .ఇదంతా చంద్రబాబు రాజకీయ.

Telugu Chandrababu, Janasena, Pavan Kalyan, Ysrcp-Telugu Political News

రానున్న రోజుల్లో బిజెపి, జనసేన పార్టీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని వైసిపి 2024 ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని, మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తాయనే నమ్మకాన్ని చంద్రబాబు పార్టీ కేడర్ లో కలిగించగలిగారు.అయితే ఇది సాధ్యం అవుతుందా లేదా అనే విషయం పక్కనపెడితే , టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళాలనుకున్న నేతలు మాత్రం ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను ముందుగానే ఊహించుకుని వైసీపీలోకి వెళ్లే ఆలోచనను  విరమించుకుంటున్నట్లు గా కనిపిస్తుండటం బాబుకు మరింత ఆనందం కలిగిస్తోందట.<

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube