ఢిల్లీ లో బాబు ఆరోపణలు ! బాబు టార్గెట్ మోదీ నే  

  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి టార్గెట్ బిజెపి టార్గెట్ వైసిపి అన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి మరి దుమ్ము దులిపేశారు. ఏపీలో జగన్ పై జరిగిన దాడి టిడిపి ప్రభుత్వానికి మాయని మచ్చలా తయారవడంతో నష్ట నివారణ చర్యలు చంద్రబాబు దిగినట్టు కనిపిస్తోంది. పనిలో పనిగా ఈ నెపాన్నంతటినీ… కేంద్రం వైసిపి పై నెట్టివేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ప్రెస్ మీట్ మొదటి నుంచి చివరి వరకు కూడా మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ప్రసంగం కొనసాగించారు. టిడిపి బిజెపి బంధం కొనసాగుతున్న సమయంలో జరిగిన వైఫల్యాలను కూడా చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావించడం అవకాశవాద రాజకీయాలను గుర్తు చేస్తుంది.

  • Chandrababu Delhi Tour Targets Modi-

    Chandrababu Delhi Tour Targets Modi

  • ఇక నేషనల్ మీడియాతో మాట్లాడడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీపై తాము పోరాడుతున్నామని అందులో భాగంగానే మాపై ఈ విధమైన కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని సంకేతాలను చంద్రబాబు ఇవ్వాలనే తాపత్రయం కనిపించింది. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న చంద్రబాబు… అన్ని వ్యవస్థలను కేంద్రం బలహీనపరుస్తోందని ఆరోపించారు. కేంద్ర బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై దాడి జరిగితే ఏపీ ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు.

  • Chandrababu Delhi Tour Targets Modi-
  • ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగతా జాతీయ నేతలకు వివరించిన చంద్రబాబు, ప్రధాని మోడీ విధానాలను ఎండగట్టారు. అన్ని వ్యవస్థలను కేంద్రం బలహీనపరుస్తోందని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో వృద్ధిరేటు ఆగిపోయిందన్న చంద్రబాబు… దేశంలో బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబే ఆపరేషన్ గరుడ అంశాన్ని ప్రస్తావించారు. సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రకారమే జరుగుతున్నాయని, ఏపీలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి తద్వారా జోక్యం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.