ఏపీలో భారీ పోలింగ్ బాబుని భయపెడుతుందా  

ఏపీలో ఎన్నికల తీరుపై ఈసికి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు. .

Chandrababu Delhi Tour For Complaining On Ap Election Officer-

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే దేశంలో ఎవరిని అడిగిన ఒకటే మాట చెబుతారు.రాజకీయ ఉద్దండుడు.రాజకీయాలలో ఓనమాలు నుంచి చివరి అక్షరం వరకు ప్రతిది తెలిసిన వ్యక్తి.అతని ఎత్తులు, పై ఎత్తులు అందుకోవడం, తెలుసుకోవడం ఎవరికి అంత ఈజీ కాదు.

Chandrababu Delhi Tour For Complaining On Ap Election Officer--Chandrababu Delhi Tour For Complaining On AP Election Officer-

తన రాజకీయ లబ్ది కోసం అవసరం అయితే ఏం చేయడానికి అయిన చంద్రబాబు రెడీ అవుతారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఉంది.అలాంటి చంద్రబాబు ఏపీలో పోలింగ్ తర్వాత మీడియా ముందుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది అంటూ, అలాగే ఎన్నికలలో వైసీపీ కుట్రలు చేసి రిగ్గింగ్ లకి పాల్పడింది అని విమర్శలు చేసారు.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు దేశ రాజధాని ఢిల్లీలో పర్యాటన పెట్టుకున్నారు ఈసీ తీరు, ఈవీఎం లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించుకొని చంద్రబాబుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అయ్యారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలపై సీఎం ఫిర్యాదు చేయనున్నారు.

వీవీప్యాట్‌ల లెక్కింపుపై తెలుగుదేశం పార్టీ తరపున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు.ఇప్పుడు ఉన్నపళంగా బాబు ఇలా ఢిల్లీ లాబీయింగ్ వెనుక భారీగా నమోదైన పోలింగ్ అతనిని భయపెట్టడమే కారణం అనే మాట బలంగా వినిపిస్తుంది.మరి ఎన్నికల తర్వాత ఢిల్లీ రాజకీయ బాబుగారికి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.