ఓవర్ టూ ఢిల్లీ : ఏపీ రాజకీయం పై బాబు మాస్టర్ ప్లాన్ ?

Chandrababu Delhi Tour Fixed On Saturday

సరిగ్గా తెలుగుదేశం పార్టీ లో నిరాశ నిస్పృహలు అలుముకున్న సమయంలోనే టిడిపి కేంద్ర కార్యాలయం తో పాటు , అనేక చోట్ల వైసిపి కార్యకర్తలు చేసిన దాడులు బాగా కలిసి వచ్చాయి.తమ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన విమర్శల సంగతి ని పూర్తిగా బాబు పక్కనపెట్టి వైసీపీ శ్రేణులు మంగళగిరిలోని టిడిపి ఆఫీస్ పై జరిగిన దాడిని హైలెట్ చేస్తూ, దేశవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహారాలు చేయడం లో బాబు సక్సెస్ అయ్యారు.

 Chandrababu Delhi Tour Fixed On Saturday-TeluguStop.com

నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు.అంతేకాదు 36 గంటల పాటు నిరాహార దీక్షలో పాల్గొనబోతున్నాను అంటూ ప్రకటించారు.

ఈ రోజు బాబు  దీక్ష మొదలవుతుంది.

 Chandrababu Delhi Tour Fixed On Saturday-ఓవర్ టూ ఢిల్లీ : ఏపీ రాజకీయం పై బాబు మాస్టర్ ప్లాన్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పూర్తిస్థాయిలో వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు రంగంలోకి దిగినట్టు గా కనిపిస్తున్నారు.

ఇప్పటికే ఏపీ లో చోటుచేసుకున్న దాడులు వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.ఈ నిరసన దీక్ష పూర్తయిన తర్వాత ,  ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను స్వయంగా కలిసి,  వైసీపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయాలని , పనిలోపనిగా ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్లే విషయం పైన చర్చించాలనే వ్యూహంలో ఉన్నారు.
 

Telugu Amith Sha, Bjp Tdp Aliance, Cbn, Chandrababu, Chandrababu Delhi Tour, Jagan, Modhi, Pattabhi, Prime Minister, Tdp, Telugudesam-Telugu Political News

 ప్రస్తుతం ఏపీ లో చోటుచేసుకున్న సంఘటనల ద్వారా టీడీపీకి మంచి మైలేజ్ వచ్చిందని,  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని బాబు నమ్ముతున్నారు.ఇదే అదనుగా బీజేపీ కి దగ్గరయ్యేందుకు ఢిల్లీ టూర్ ఉపయోగించుకోవాలనే ఎత్తుగడలో బాబు ఉన్నట్టు సమాచారం.ఈనెల 30వ తేదీన జరగబోతున్న బద్వేల్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిని నిలబెట్టడం టిడిపి జనసేన పార్టీ లు పోటీకి దూరంగా ఉండడంతో,  ఈ అంశాన్ని బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించాలని,  పరోక్షంగా బిజెపి అభ్యర్థి కి తాము మద్దతు ఇస్తామనే విషయాన్ని ప్రస్తావించి బిజెపి పెద్దలకు టీడీపీ పై సానుకూలత పెంచాలి  అనేది బాబు ఎత్తుగడగా తెలుస్తోంది.ఏది ఏమైనా ఢిల్లీ నుంచే ఏపీ రాజకీయాన్ని తమకు అనుకూలంగా మార్చాలనే కసితో బాబు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

       

#Jagan #Desam #Chandrababu #Bjp TDP Aliance #Modhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube