ద‌క్ష‌త లేకే.. దీక్ష‌.. బాబు చుట్టూ విమ‌ర్శ‌ల ప‌ర్వం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు దీక్ష చేప‌ట్టారు.ప్ర‌త్యేక హోదా స‌హా ఏపీకి రావాల్సిన నిధుల విష‌యంలో ఆయ‌న కేంద్రంపై ప్రారంభించిన బ‌హుముఖ పోరులో భాగంగా 12 గంట‌ల పాటు నిర‌వ‌ధిక నిర‌శ‌న దీక్ష ను ప్రారంభించారు.

 Chandrababu Deeksha Pai Netizens Comments-TeluguStop.com

శుక్ర‌వారం ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను సైతం ప‌క్క‌న పెట్టి ధ‌ర్మ పోరాట దీక్షఅనే పేరుతో దీక్ష‌ను ప్రారంభించారు.రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌ను ఆయ‌న చేర‌దీశారు.

అంద‌రి మ‌ద్ద‌తుతోనూ ఆయ‌న పోరాట దీక్ష ప్రారంభించారు.దీనికి సూచిక‌గా దీక్ష ప్రారంభంలోనే స‌ర్వ‌మ‌త ప్రార్ధ‌న‌లు చేశారు.

అన్ని ప్ర‌జా సంఘాల‌ను ఆహ్వానించారు.భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు.

ఏపీ అభివృద్ధి కోసం తాను చేస్తున్న‌ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఈ పోరు సాగుతోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.మొత్తంగా రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ది కోసం ఈ దీక్ష సాగుతోంద‌ని, ఏపీ పౌరులైన ప్ర‌తి ఒక్క‌రూ ఈ దీక్ష‌లో ముందుండి న‌డ‌వాల‌ని పిలుపునిచ్చారు.

దీంతో అన్ని వ‌ర్గాలూ ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యాయి.అయితే, ఇక్క‌డే ధ‌ర్మ పోరాట దీక్ష‌పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు మేధావులు.యువత కూడా వీరికి మ‌ద్ద‌తునిస్తూ.బాబును ప్ర‌శ్న‌ల వ‌ర్షంతో ముంచెత్తింది.ప్ర‌ధానంగా బాబును సంధిస్తున్న ప్ర‌శ్న‌.దేశంలో ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పార్ల‌మెంటులో విప‌క్షాలు ఆందోళ‌న చేశాయ‌ని, ఇది ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్ట‌ని పేర్కొంటూ.

ఓ పూట దేశ రాజ‌ధానిలో దీక్ష చేశారు.అప్ప‌ట్లో దీనిపై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

అదేవిధంగా వైసీపీ నేత‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏదైనా ఉద్య‌మాలు, ధ‌ర్నాలు, దీక్ష‌లు చేస్తామ‌ని అనుమ‌తి కోరితే.ఏపీకి హోదా కోసం ఇక్క‌డ చేసి ఏం ప్ర‌యోజ‌నం.

పోయి ఢిల్లీలో చేసుకోండ‌ని గ‌తంలో చంద్ర‌బాబు ఉచిత స‌ల‌హాలు పారేశారు.అంతేకాదు, నిర్బంధంగా యువ‌త‌ను సైతం దీక్ష‌ల్లో పాల్గొన‌కుండా చేశారు.

జ‌గ‌న్‌తో ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త క‌లిస్తే.నేర‌స్తులు అవుతారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.ఇప్పుడు ఇవే అంశాల‌ను నెటిజ‌న్లు.ముఖ్యంగా మేధావి వ‌ర్గం విశ్లేష‌ణాత్మ‌కంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌న్నది ఎవ‌రో? చంద్ర‌బాబు చెప్పాల‌ని వారు డిమాండ్‌చేస్తున్నారు.అదేస‌మ‌యంలో ఏపీకోసం ఉద్య‌మించిన జ‌గ‌న్‌ను విశాఖ విమానాశ్ర‌యంలో అట‌కాయించి క‌నీసం విశాఖలో రోడ్డు మీద‌కు కూడా రాకుండా చేసింది ఎవ‌రో చెప్పాల‌ని కోరుతున్నారు.

ఇక‌, ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాలంటే.ఢిల్లీలో కూర్చుని ధ‌ర్నా చేయాల‌న్న చంద్ర‌బాబు ఇప్పుడు త‌న విష‌యం వ‌చ్చే స‌రికి విజ‌య‌వాడ‌లో అదికూడా ప్ర‌జాధ‌నంతో ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాల‌ని నిలదీస్తున్నారు.

ఇక‌, అతి ముఖ్యంగా ఆనాడు మోడీ దీక్ష చేసిన స‌మ‌యంలో ప్ర‌భుత్వంలో ఉండి దీక్ష‌లు ఎందుకు చేస్తున్నారో చెప్పాల‌ని కోరిన పెద్ద‌మ‌నిషి.ఇప్పుడు ఆయ‌న కూడా ప్ర‌భుత్వంలోనే ఉండి, కేంద్రం మెడ‌లు వంచ‌డం చేత‌కాక‌, పాల‌న‌లో ద‌క్ష‌త చూపించ‌లేక దీక్ష‌కు దిగాడా? అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.ఇప్పుడు ఇవ‌న్నీ గ‌త రాత్రి నుంచి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.మొత్తంగా బాబు చేస్తున్న దీక్ష‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.బాబు కాకుండా త‌న ఎంపీల‌తో ఈ దీక్ష‌ను ఢిల్లీలో నే చేయించి ఉంటే బాగుండేద‌ని.అంటున్నారు నెటిజ‌న్లు.

మ‌రి ఏదేమైనా .బాబు దీక్ష ప్రారంభ‌మైపోయింది.ఫ్యూచ‌ర్ ఏంటో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube