జగన్ పవన్ బాటలో బాబు ? వారికి రిటైర్మెంటే ?

జనసేన పార్టీలో ఎక్కడ చూసినా యువ నాయకులు కనిపిస్తుంటారు.రాజకీయంగా వారికి పెద్దగా అనుభవం లేకపోయినా, జనసేన ను అధికారం వైపు తీసుకువెళ్లాలనే కసి పట్టుదల వారిలో కనిపిస్తూ ఉంటాయి.

 Chandrababu Decided To Promote Young Leaders In The Tdp Instead Of Senior Leaders-TeluguStop.com

అందుకే పార్టీ ఆదేశాలు ఉన్నా , లేకపోయినా జనసేన కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ స్వచ్ఛందంగా పార్టీని అధికారంలోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీలోని నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు.వారు ఎక్కువగా యూత్ కావడంతో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్ధులు అందరికీ సవాల్ విసురుతూ జనసేన పై వచ్చే నెగటివ్ కామెంట్స్ కు అంతే స్థాయిలో ఘాటు సమాధానం ఇస్తూ పార్టీని మోస్తూ వస్తున్నారు.

ఇక ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే అక్కడ సీనియర్ నాయకులు ఎక్కువగానే ఉన్నా , జగన్ మాత్రం యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.తన మంత్రి మండలి లో యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

 Chandrababu Decided To Promote Young Leaders In The Tdp Instead Of Senior Leaders-జగన్ పవన్ బాటలో బాబు వారికి రిటైర్మెంటే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే 151 మంది ఎమ్మెల్యేల లో చాలామంది యూత్ కనిపిస్తారు.అలాగే కొత్తగా ఎన్నికైన వారు అంతే స్థాయిలో ఉన్నారు.

ఎక్కడికక్కడ చురుకైన యువ నాయకులను ప్రోత్సహిస్తూ జగన్ సరి కొత్త స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నారు.

Telugu Ap, Cbn, Chandrababu, Jagan, Janasena, Lokesh, Pavan Kalyan, Tdp, Tdp Seniour Leaders, Ysrcp-Telugu Political News

పార్టీ సీనియర్ నాయకులు వారసులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ , పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ,  భవిష్యత్తులో వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుంది అనే విధంగా జగన్ సంకేతాలు ఇస్తుండడంతో సీనియర్ నాయకులు సైతం జగన్ ముందు చూపును పసిగట్టి , తాము పక్కకు తప్పుకుని వారసులను ప్రోత్సహిస్తూ జగన్ కు సహకరిస్తూ వస్తున్నారు .2024 ఎన్నికల నాటికి సీనియర్లను తప్పించి వారి స్థానంలో యువ నాయకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

కానీ టిడిపి పరిస్థితి చూస్తే దీనికి భిన్నం.పార్టీలో యువ నాయకులు బాగా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు.ఎక్కువగా తలలు పండిన సీనియర్లు  ఆ పార్టీలో ఉండడంతో మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రసంగాలను, తమ రాజకీయాన్ని మార్చుకోవడం లో విఫలమవుతున్నారు.

ఇంకా మూస రాజకీయాలకు తెరపైకి తెస్తూ, పార్టీని మరింత ఇబ్బందులపాలు చేస్తున్నారు.ఈ విషయంలో చంద్రబాబు ఎవరిని ఏమి అని పరిస్థితుల్లో లేరు.ఎందుకంటే వారంతా ఎంతో కాలంగా తన వెంట నడిచిన వారు కావడంతో మొహమాటంగా అయినా, వారికి కీలక పదవులు అప్పగించి ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీని కారణంగా టిడిపి రాజకీయంగా ఎంతో నష్టపోతోంది.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చకపోతే రాబోయే ఎన్నికల్లో మళ్లీ టిడిపికి పరాభవం తప్పదని సీనియర్ నాయకులు చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదని గ్రహించిన బాబు యువ నాయకులను ఎక్కువగా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు.దీనికి తోడు తన తనయుడు లోకేష్ రాజకీయ జీవితానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు బాబు ఈ ప్లాన్ పక్కగా అమలుచేసి తీరాలని నిర్ణయించుకున్నారు

.

#TDPSeniour #Janasena #Jagan #Chandrababu #Pavan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు