విశాఖ ఎన్నికల ప్రచారంలో  వైసీపీ పార్టీ పై విమర్శలు చేసిన చంద్రబాబు..!!

పంచాయతీ ఎన్నికలలో చాలా  స్థానాలు కోల్పోవటంతో.మున్సిపల్ ఎన్నికలలో రాణించాలని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు.

 Chandrababu Criticizes Ycp In Visakhapatnam Election Campaign-TeluguStop.com

ఈ క్రమంలో రాష్ట్రంలో కీలక కార్పొరేషన్లు అయినా చోటా విస్తృతంగా పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు.పార్టీల గుర్తు తరఫున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఈ మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఇలాంటి తరుణంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు వైసిపి పార్టీ పై విమర్శల వర్షం కురిపించారు.

 Chandrababu Criticizes Ycp In Visakhapatnam Election Campaign-విశాఖ ఎన్నికల ప్రచారంలో  వైసీపీ పార్టీ పై విమర్శలు చేసిన చంద్రబాబు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాత గాజువాక జంక్షన్ పరిధిలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తూ వైసీపీకి ఓటు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరియు పన్నుల పెంపు కి స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా వైసిపి పార్టీకి చెందిన ఒక మంత్రికి రెండు మూడు రోజుల్లో ఇసుక కాంట్రాక్ట్ ప్రభుత్వం కట్ట పెడుతున్నట్లు ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం లక్ష్యం రాష్ట్రాన్ని దోచుకోవడం దాచుకోవడం అని మండిపడ్డారు.

ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.ప్రభుత్వంపై తిరగబడుతున్న వారిపై కేసులు పెడుతున్నారు.

, కానీ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులంతా నేర చరిత్ర కలిగిన వాళ్లే అంటూ మండిపడ్డారు.

#Vizag #Ysrcp #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు