మోదీకి ముచ్చెమటలు పట్టిస్తున్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఒకపట్టాన ఎవరికీ అర్ధం కాదు.కిందపడ్డ తనదే పై చేయి అన్నట్టుగా బాబు వ్యవహారశైలి ఉంటుంది.

 Chandrababu Creating Pressure On Modi-TeluguStop.com

అందుకే రాజకీయంగా బాబు ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అనేది బాబు ని దగ్గరగా చూస్తున్నవారు చెప్పేమాట.ఇప్పడు ఆ విషయం ఆలస్యంగా అయినా ప్రధాని నరేంద్ర మోదీకి బాగా తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది.

ఏపీలో బాబు ని దెబ్బకొట్టడానికి మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగేట్టుగా ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.ఎన్నికలకు సిద్ధం కావడానికి చంద్రబాబుకు టైమ్ లేకుండా చేసి ఆయనను ఓడించాలనేది మోదీ వ్యూహం.

అందులో సఫలం అయ్యారో లేదో తెలియాలంటే మే 23వరకూ వేచి చూడాల్సిందే.

ఇక ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన నాయకులంతా విదేశీ టూర్లు, పర్యాటక ప్రదేశాలు చుట్టి వచ్చేందుకు ప్లాన్ వేసుకుంటుండగా బాబు మాత్రం ఈవీఎం ల అంతు తేల్చేందుకు ఢిల్లీబాట పట్టాడు.

ఈవీఎంలు గోల్ మాల్ చేస్తున్నారని దేశాన్ని అలెర్ట్ చేస్తూనే మోదీ పరువు బజారున పడేసేందుకు సిద్ధం అవుతున్నాడు.నిన్న అంటే ఆదివారం 23 ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు.

నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షాన్ని తట్టి లేపి మీడియా ముందుకు తెచ్చి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు చంద్రబాబు.సార్వత్రిక ఎన్నికలలో ఇంకా ఆరు విడతల పోలింగ్ మిగిలి ఉంది.

ఈ సమయం అంతా మోదిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకే బాబు ప్లాన్ చేసుకుంటున్నాడు.

దీనిలో భాగంగానే బీజేపీ ని వ్యతిరేకించే అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటూ వారికి ప్రచారం చేసేందుకు బాబు ప్లాన్ వేసుకుంటున్నాడు.ఇప్పటికే జేడీఎస్ కోసం కర్ణాటకలో ప్రచారం చెయ్యడానికి ఒప్పుకున్నారు.దేశవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వారి ప్రాభల్యం ఉంటే అక్కడకి వెళ్లి ప్రచారం చేస్తా అని చెప్పుకొస్తున్నారు.

బాబు తీసుకుంటున్న ఈ స్టెప్ మోదీ అండ్ కో బృందానికి కలవరం పెట్టిస్తున్నాయి.బాబు పర్యటనలు ఎక్కడ తమ ప్రాబల్యాన్ని తగ్గిస్తాయో అన్న ఆందోళన కూడా మోదీలో కనిపిస్తోంది.

బాబు మాత్రం వరుస వరుసగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొని ఆయా రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube