ఎన్నికల వేడి పుట్టించనున్న బాబు...జులై 16 ముహూర్తం

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు తన ఆలోచనలకి పదును పెట్టనున్నారు.ఇప్పటికే ఎన్నో రకాల వ్యుహాలని సిద్దం చేసుకున్న చంద్రబాబు.

 Chandrababu Createselections Heat On July 16th-TeluguStop.com

కేంద్రానికి వెన్నులో వణుకు పుట్టించే ప్లాన్ కూడా ఒకటి సిద్దం చేశాడని తెలుస్తోంది.ఇప్పటికే కీలక నేతలతో ఈ వ్యుహలకి తుదిమెరుగులు చంద్రబాబు దిద్దేశారట.

అయితే ఏపీలో టీడీపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవయితే ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ టీడీపీ ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితిలో ఏపీ ప్రజానీకాన్ని తన వైపు తిప్పుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది అదికూడా తెలుగుదేశం పార్టీ కి ఈ క్రెడిట్ అంతా వెళ్ళిపోవడానికి చంద్రబాబు ఒక భారీ ప్లాన్ వేసుకున్నారు

చంద్రబాబు నాయుడు గతంలో ఊపు మీదున్న ఆంధ్రుల పోరాటాన్ని యిప్పుడు తెరపైకి తీసుకురావలని ట్రై చేస్తున్నాడు.ఈ పోరాటాన్ని ఆత్మగౌరవం నినాదంతో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే నిన్న మంత్రులు, ఎంపీలతో సమావేశమయిన బాబు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని వారికి దిశానిర్దేశం చేశాడు.

జూలై పదహారు నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవబోతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన వ్యూహాలు బయటపడుతున్నాయి…ఈ రకంగానే హోదా కోసం తన ఎంపీలతో రాజీనామాలు చేయించిన జగన్ తనదైన వ్యూహంలో పోరాడి ప్రజలలో మంచి మార్కులు కొట్టేసాడు.బాబు కూడా పార్లమెంటు సమావేశాలు మొదలయిన తరువాత జగన్ లాగా తన ఎంపీలతో రాజీనామాలు చేయించి ప్రజలలో టీడీపీ కేంద్రంపై పోరాడుతున్నది అన్న అంశాన్ని బలంగా చొచ్చుకుపోయేలా చేయాలన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే విజయనగరం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి, మరియు సుజనా చౌదరి లచే తమ కేంద్రమంత్రుల పదవులకు రాజీనామా చేయించినప్పటికీ అవి జగన్ చేయించిన రాజీనామాల లాగా ప్రజలలోకి వెళ్లలేదు.ఎలాగూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి కనీసం ఇప్పుడైనా తన ఎంపీలతో రాజీనామా చేయించి.

ఎలాగోలా ప్రజల దగ్గర చివరి సమయంలో ఓట్లని కొల్లగోట్టాలి అనేది చంద్రబాబు పక్కా వ్యూహంగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube