దయనీయంగా మారిన చంద్రబాబు పరిస్థితి..!!!!

40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కుని ఉండరు చంద్రబాబు నాయుడు.రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుంటూ వచ్చిన చంద్రబాబుకి ఈ 2019 ఎన్నికలు మాత్రం చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి.

 Chandrababu Condition Turned Out To Be Bad-TeluguStop.com

వయసు మీద పటడం ఒక కారణం అయితే, తన తరువాత పార్టీని నడిపించే సత్తా తన కుమారుడు లోకేష్ కి లేదనే ఆలోచన బాబుని మరింతగా కలవరపెడుతోంది.అన్నిటికంటే ముఖ్యంగా “వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గనుకా ఓడిపోతే” అనే ఒకే ఒక్క మాట చంద్రబాబు ని అతలాకుతలం చేస్తోంది.

ప్రస్తుతం బహిరంగ వేదికలపై బాబు చేస్తున్న ప్రచారం సరిగ్గా విన్న వారెవరికైనా సరే బాబు లో తెలియని ఆందోళన రేగుతోందని ఇట్టే పసిగాట్టేస్తారు.ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు సైతం ఇలా మాట్లాడేది చంద్రబాబేనా అనే సందేహాలని వ్యక్త పరుస్తున్నారట.

ఒక విమర్శ చేసిన వెంటనే ,అందుకు అనుగుణంగా మాట్లాడకుండా వేరొక విమర్సలోకి వెళ్ళిపోవడం.ఒక్కో సారి తానూ ఏమి చెప్తున్నారో కూడా మర్చి పోవడం, వెకిలిగా కావాలని నవ్వు తెప్పించుకుని నవ్వడం, నేను చెప్పేది నిజమా కాదా అని ఒకటికి రెండు సార్లు ప్రజల నుంచీ సమాధానం రాకపోయినా అడిగి మరీ చెప్పించుకోవడం చూస్తుంటే చంద్రబాబు లో టెన్షన్ మొదలయ్యిందనే కోణం స్పష్టంగా బాబు ముఖంలో కనిపిస్తోందని అంటున్నారు.

అంతేకాదు గతంలో మాదిరిగా చంద్రబాబు స్పీచ్ లలో పస తగ్గిపోయిందట.వాడి వేడిగా ప్రసంగాలు చేసే బాబు లో అప్పటి జోష్ కనిపించడం లేదని ఆందోళన తో కూడిన వ్యాఖ్యలు చేయడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని సొంత పార్టీ నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్నారట.ఇదిలాఉంటే తాను ఓడిపోతే ఎలా అంటూ భవిష్యత్తుపై ఇప్పటి నుంచే బెంగ పెట్టుకున్నారట.అంతేకాదు తెలంగాణలో ఎదురైనా అనుభవమే ఏపీలో ఎక్కడ ఎదురవుతుందో అనే అంచనాలు వేస్తున్నారట బాబు.

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ తో విభేదించిన బాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి తెలంగాణలో టీడీపీ ఉనికి కూడా లేకుండా చేసుకున్నసంగతి అందరికి తెలిసిందే అయితే.మళ్ళీ అప్పటి పరిస్థితులు ఏపీలో ఎక్కడ పునరావృతం అవుతాయోననే భయంతో ఆందోళన చెండుతున్నారట.

అయితే చంద్రబాబ ఈ విషయంలో ఎలాంటి భరోసా పార్టీలోని కార్యకర్తలకి , నేతలకి ఇస్తారో వేచి చూడాల్సిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube