మూడో విడత ఎలక్షన్ విషయంలో నిమ్మగడ్డ కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు..!!

మూడో విడత పంచాయతీ ఎన్నికలలో అధికారులతో వైసీపీ పార్టీ నాయకులు కుమ్మక్కయి రీకౌంటింగ్ పేరుతో ఫలితాలు తారుమారు చేస్తున్నట్లు ప్రతిపక్షనేత చంద్రబాబు ఎస్ఈసీ నిమ్మగడ్డ కి ఫిర్యాదు చేశారు.మూడో విడత పంచాయతీ ఎన్నికలలో ఎక్కడైతే వైసిపి బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు అటువంటి ప్రాంతాలలో ఫలితాలను వెల్లడించకుండా రీకౌంటింగ్ పేరుతో ఫలితాలు తారుమారు చేస్తున్నట్లు చంద్రబాబు తన ఫిర్యాదులో ఆరోపించారు.

 Chandrababu,nimmagadda Ramesh Kumar,panchayathi Elections,ysrcp-TeluguStop.com

అనంతపురం జిల్లా సలకంచెరువు, ప్రకాశం జిల్లా చినపవని, కలవల్ల, విజయనగరం జిల్లా పర్ల, కృష్ణా జిల్లా ఆర్తమూరు, శ్రీకాకుళం జిల్లా బల్లేరు, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం, రాజుపేట, బందర్లపల్లి, గొరివిముకులపల్లి, పంద్యాలమడుగు, ముద్దనపల్లి, బైపరెడ్డిపల్లి, 89 పెద్దూరు, బాల్ల కుప్పం మండలం నదిమూర్, కంగుంది, వనగట్టుపల్లి పంచాయతీల్లో ఇలా ఫలితాలు తారమారైనట్టు చంద్రబాబు  పేర్కొన్నారు.ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వెంటనే.

ఫలితాలు ప్రకటించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన ఫిర్యాదులో సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube