తీరు మార్చుకొని బాబు...పదే పదే అదే తప్పు     2018-06-17   03:23:06  IST  Bhanu C

బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకే అజెండాతో చెప్పిందే చెప్పి విసుగుపుట్టిస్తున్నాడు తప్ప కొత్త విషయాలు ఏమీ చెప్పడంలేదు. బీజేపీని ఏపీకి అన్యాయమే చేసి ఉండవచ్చు. కానీ పదేపదే ఆ పార్టీ ని తిట్టడం వాళ్ళ ఏపీలో టీడీపీకి పెద్దగా కలిసొచ్చే అంశం ఏమీ లేదు. ఎందుకంటే.. బీజేపీ ఇక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి ఎలాగూ లేదు .పడే పడే బీజేపీని విమర్శించడం వల్ల తన అసమర్ధతను చంద్రబాబు కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తున్నాడని సామాన్య జనంలో అనుమానం మాత్రం రేకెత్తుతోంది.

అసలు ఏపీలో అభివృద్ధి విషయానికి వస్తే… టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి… ఇప్పటివరకు ఏమి సాధించారో గట్టిగా చెప్పలేకపోతోంది. ఆ పార్టీ అసలు ఏమి చేసింది?. నామమాత్రపు పనులుచేయడం, పదుల సంఖ్యలో విదేశ ప్రయాణాలు మందీ మార్బలం వెంటేసుకొని, ఒకే నిర్మాణానికి పదిసార్లు ప్రారంభోత్సవాలు, ప్రజలకు పలుమార్లు అంకితం చేయడం, తాను నిప్పు అని చెపుతూ వారు విపక్షం నేరగాళ్ళని చెపుతూ బురద జల్లడం ఇదే పనిగా పెట్టుకుంది.

తెలుగుదేశం పార్టీ అజెండా ఒక్కటే అదే భారతీయ జనతాపార్టీపై వీలైనంత వ్యతిరేకతను ప్రజల్లో పెంపొదించడం.బీజేపీపై ఎంత వ్యతిరేకత పెంచినా తెలుగుదేశం పార్టీకి ఇసుమంతైనా లాభం లేదు. కారణం బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి స్థానం లేదు. అయినా తాను రాష్ట్రానికి ఏ న్యాయం చేయకుండా పూర్తిగా వృధా చేసిన నాలుగేళ్ళ కాలానికి చంద్రబాబు నాయుడు ప్రజలకు లెక్కజెప్పాలి అదీ 2019 ఎన్నికలకు ముందే.