వాళ్లకు నా ఇల్లు ముంచాలనే ఆలోచన తప్ప మరేమీ లేదు  

Chandrababu Comments On Jagan And Jagan Governament - Telugu Ap People Suffer From Viral Fever, Chandrababu, Tdp Chief Chandrababu Naidu, Ycp Jagan Mohan Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.జగన్‌ సీఎం అయినప్పటి నుండి కూడా వైకాపా నాయకులు నా ఇల్లు ఎలా ముంచాలి అనే ఆలోచనలో ఉన్నారు తప్ప రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా పరిష్కరించాలి అనే విషయాలపై శ్రద్ద పెట్టలేదు అంటూ చంద్రబాబు ఎద్దేవ చేశాడు.

Chandrababu Comments On Jagan And Jagan Governament

ప్రజలు డెంగ్యూ మరియు ఇతరత్ర జబ్బులతో తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయే పరిస్థితికి వస్తే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ పార్టీ నాయకులతో మాట్లాడుతూ.

వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు.గతంలో నన్ను దోమలతో యుద్దం చేస్తున్నట్లుగా ఎద్దేవ చేశారు.

కాని ఇప్పుడు ప్రభుత్వం ఆ పని చేయక పోవడంతో ప్రజలకు తీవ్ర అనారోగ్యం వస్తుంది.వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపుగా 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మా వద్ద రిపోర్ట్‌ ఉందని, వారిని ఆదుకోవడం మానేసి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను నాయకులను టార్గెట్‌ చేయడానికే వారు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అంటూ జగన్‌పై బాబు విమర్శలు చేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు