బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా మళ్లీ ఆయనే ? వైసీపీ అభ్యర్థి ఈమేనా ? 

ఈ నెలలోనే దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.ఇప్పటికే అన్ని పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేసింది.

 Chandrababu Chose Obulapuram Rajasekhar As The Tdp Candidate For Badwell Constit-TeluguStop.com

కరోనా వైరస్ కు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటోంది.ఈ లెక్కన చూస్తే ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడేలా కనిపిస్తోంది.

అయితే ఏపీలో పెద్దగా హడావుడి కనిపించడం లేదు.తెలంగాణలోని హుజురాబాద్ లో ఈ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే సైలెంట్ గా తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టింది.అందరికంటే ముందుగానే బద్వేల్ నియోజకవర్గం లో జరగబోయే ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఓబులాపురం రాజశేఖర్ ను బద్వేల్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
     ఇక్కడ వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటసుబ్బయ్య కరోనా వైరస్ ప్రభావం తో మార్చి 26వ తేదీన మరణించారు.

దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోనే అక్కడ ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఈ షెడ్యూల్ కాస్త ఆలస్యమైంది.అయినా ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో వచ్చే అవకాశం ఉండటంతో, టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.

ఇక్కడ విస్తృతంగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కడప జిల్లా వైసీపీ కి కంచుకోటగా ఉండడంతో ఇక్కడ చంద్రబాబు కాస్త ముందుగానే ఈ ఎన్నికల పై దృష్టిసారించారు.
     

Telugu Ap Cm Jagan, Ap, Badvel Mla, Chandrababu, India, Hujurabad, Jagan, Ysrcp-

   2019 ఎన్నికల్లో ఓబులాపురం రాజశేఖర్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడంతో,  ఆయన పై సానుభూతి ఉంటుందని, అలాగే ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండటం కూడా తమకు కలిసి వస్తుందని చంద్రబాబు భావించడం తోనే ఆయన పేరు మళ్లీ ప్రకటించారు.ఇదిలా ఉంటే వైసీపీ నుంచి ఎవరిని పోటీకి దించబోతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధ కే టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ నియోజకవర్గంపై ఇప్పటికే జగన్ ఇంటెలిజెన్స్ వర్గాల తో పాటు, ప్రైవేట్ సర్వే చేయిస్తున్నారని, ఆ రిపోర్టు ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ప్రభుత్వం తరఫున ఇప్పటికే ఈ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయిస్తూ సైలెంట్ గా జగన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube