నిరాహార దీక్షకు దిగిన చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 12 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నారు.నేడు ఛలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.

 Chandrababu Chalo Athmakure Cbn-TeluguStop.com

అయితే ఛలో ఆత్మకూరుకు ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు.ఆత్మకూరులో అంతా బాగానే ఉన్నా టీడీపీ నాయకులు రాజకీయం చేసే ఉద్దేశ్యంతో కుట్రలు పన్నుతున్నారు అంటూ వైకాపా నాయకులు ఆరోపించడంతో పోలీసులు ఛలో ఆత్మకూరుకు అనుమతించలేదు.

అనుమతి లేకున్నా కూడా ఆత్మకూరు వెళ్లేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రయత్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.

ఇక చంద్రబాబు నాయుడును ఆయన ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు నిర్భందించారు.దాంతో బాబు తన ఇంట్లోనే 12 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నాడు.ఇక బాబును కలిసేందుకు వస్తున్న తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.ఇంటి వద్ద పోలీసుల హడావుడిపై లోకేష్‌ పైర్‌ అయ్యాడు.

ఈ విషయమై పోలీసులకు లోకేష్‌కు వాగ్వివాదం జరిగింది.మొత్తానికి ఛలో ఆత్మకూరు క్యాన్సిల్‌ అయ్యి చంద్రబాబు దీక్షకు దారి తీసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube