బాబు గారి సవాల్ ! మీకు ఆ దమ్ము ఉందా ...?  

Chandrababu Challenges Trs Ysrcp And Janasena-

రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం లో టీడీపీ అధినేత చంద్రబాబు ని మించిన నాయకుడు మరొకరు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. క్లిష్టమైన పరిస్థితులను కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కుంటూ… ప్రత్యర్థి పార్టీలను ఇరుకునపెట్టేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా…తన రాజకీయ ప్రత్యర్థులను ఇరుకునపెట్టే విధంగా బాబు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలనూ టార్గెట్ చేశారు. మోదీకి అనుకూలమో..

బాబు గారి సవాల్ ! మీకు ఆ దమ్ము ఉందా ...? -Chandrababu Challenges Trs Ysrcp And Janasena

వ్యతిరేకమో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, జనసేనలను తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాల్సిన పరిస్థితిని కల్పించారు.

బీజేపీ మీద పీకలదాకా కోపంతో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాడు. అంతే కాదు బీజేపీని ఇరుకున పెట్టేలా … ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తూ బీజేపీని భయపెడుతున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… బీజేపీ మిత్రపక్షం అని చెప్పుకోవడానికి ఏ పార్టీ కూడా సిద్దంగా లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అసలు బీజేపీ పొడే గిట్టవన్నట్లుగా పార్టీలు ఉంటున్నాయి. అన్ని పార్టీలు అంతే. కానీ కొన్నిపార్టీలు మాత్రం .

లోపాయికారీగా స్నేహం కొనసాగిస్తున్నాయి. కేంద్రంతో అవసరాలే కావొచ్చు..

దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పితే. ఆ కష్టాలు ఎందుకన్న .

ఆలోచన కావొచ్చు కానీ. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు బీజేపీకి దూరం అంటున్నాయి కానీ.

వాస్తవంగా దగ్గరగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇదే అంశంతో వారిని ఇబ్బందిపెట్టాలని బాబు ప్లాన్.

అందుకే… ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకం అయితే. మోదీని గద్దె దించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు ఎందుకు మద్దతు తెలపడం లేదని బాబు వారిని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం. టీఆర్ఎస్, వైసీపీ, జనసేనల వల్ల అయ్యే పని కాదు..

టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి. కాంగ్రెస్ కూటమిలోకి రాలేదు.

బీజేపీకి వ్యతిరేకమని చెప్పుకోగలదు కానీ. ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమిలో చేరడం సాధ్యం కాదు. టీఆర్ఎస్ తో పోలిస్తే.

వైసీపీకి ఎక్కడ లేని ఇబ్బందులు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకమని కూడా చెప్పుకోలేని దుస్థితి ఆ పార్టీది.

నరేంద్రమోదీ పేరు ప్రస్తావించి విమర్శలు చేయడం కూడా మానేశారు. కేంద్రం తరపున ఏపీకి అందాల్సిన సాయం ఆగిపోయినా… నిధులు ఇవ్వకపోయినా మోదీని విమర్శించే సాహసం చేయకపోవడంతో. బాబు అదే అంశంతో వారిని ఇరికించేస్తున్నాడు.