బాబు గారి ఛాలెంజ్: కేసీఆర్ నువ్వు నాలా చేయగలవా ...?     2019-01-12   23:50:59  IST  Sai Mallula

ఏపీలో తాము చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలను మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ చేయగలరా ? అని ఛాలెంజ్ విసిరారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో రైతులకు, డ్వాక్రా సంఘాలకు, పింఛన్ దారులకు తాము బాగా రుణాలు ఇచ్చామని, అదే, తెలంగాణలో ఈ విధంగా కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు.

Chandrababu Challenge To Kcr-

Chandrababu Challenge To Kcr

ఈ సందర్భంగా ఏపీపై కేంద్రం తీరుపై సీఎం విరుచుకుపడ్డారు. అ ఏపీ అభివృద్ధికి ముగ్గురు మోదీలు అడ్డుపడుతున్నారంటూ మోదీ, కేసీఆర్, జగన్ లపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ముగ్గురు మోదీలతో మనం పోరాడాలని పిలుపు నిచ్చారు. ప్రజలు బాగుపడటం వైసీపీకి ఇష్టం లేదని, కడుపు మంటతో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.