ఓహో బాబు ఆ రూట్లో వెళ్తున్నాడా ? వారు కరుణించేనా ?

ప్రజలకు మేలు చేద్దామని రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజల కోసమే రాజకీయ పార్టీ పెట్టమని, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా, పార్టీని ప్రజల కోసమే ముందుకు నడిపిస్తున్నామని,ఇలా నాయకులు ఎన్ని చెప్పినా వారి అంతిమ లక్ష్యం మాత్రం అధికారం సంపాదించడం.అధికారం ఉన్నన్ని రోజులు తమ హవా చూపిస్తారు.

 Tdp Chief Chandrababu Support To Talk Bjp Party Public Welfare Schems To Peoples-TeluguStop.com

ఇక ఆ అధికారం పోతే మళ్ళీ దాన్ని సాధించేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను వాడేస్తుంటారు.ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకుంటే, ఆ పార్టీ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంతో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉంది.

పార్టీ కేడర్ కూడా అయోమయంలో ఉంది.ఇక పెద్దఎత్తున నాయకులు కూడా వలస బాట పట్టి అధికార పార్టీ లోకి చేరిపోతున్నారు.

ఈ క్రమంలో టీడీపీ భవిష్యత్తుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బెంగ పట్టుకుంది.

ఒకవైపు అధికార పార్టీ దూకుడు తట్టుకునే విధంగా చేసుకుంటూనే, మరో వైపు పార్టీ నాయకులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక 2024 ఎన్నికల నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి చంద్రబాబుది.యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండే అవకాశాలు తక్కువ.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవాలంటే బలమైన బిజెపి పార్టీ అండదండలు ఉండాలని, అప్పుడు మాత్రమే జగన్ దూకుడును అడ్డుకోగలం అనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.ఈ నేపథ్యంలోనే కేంద్ర బీజేపీ పెద్దలకు దగ్గరయ్యేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అవసరం ఉన్నా లేకపోయినా, మోదీ, అమిత్ షా వంటి నాయకులను ప్రసన్నం చేసుకునే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.

Telugu Amith Shah, Chandrababu, Jagan, Lokesh, Narendra Modi-Political

అలాగే కేంద్రం ప్రవేశ పెట్టే ప్రతి పథకాన్ని, ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తూ చంద్రబాబు వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక రకరకాల మార్గాల ద్వారా బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సంకేతాలు పంపిస్తున్నారు.ఏదో ఒక రకంగా బీజేపీ అగ్ర నాయకులను ప్రసన్నం చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకుని జగన్ ను గద్దె దించాలని చూస్తున్నారు.

ఏపీలో మళ్లీ అధికారం దక్కించుకోవాలనే విధంగా చంద్రబాబు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక ఏపీ సీఎం జగన్ కేంద్ర బిజెపి పెద్దలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా, వారు ఆయన్ని దూరం పెడుతుండటం ఇవన్నీ తనకు కలిసి వస్తాయని చంద్రబాబు ఎదురుచూస్తున్నారు.

Telugu Amith Shah, Chandrababu, Jagan, Lokesh, Narendra Modi-Political

వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ వారసుడు లోకేష్ మరింత యాక్టివ్ అయ్యే అవకాశం ఉండడం, తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం దగ్గర్లో ఉండడంతో, ఇప్పటి నుంచే పార్టీకి ఎదురు లేకుండా చేసుకునేందుకు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఈ విధంగా ఆరాటపడుతున్నారు.కానీ టిడిపితో పొత్తు విషయంలో బిజెపి అగ్ర నేతలు అంత సుముఖంగా లేరనే సంకేతాలు వస్తున్నాయి.గతంలో చంద్రబాబు పొత్తు ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు, ఆ తర్వాత వ్యవహరించిన తీరు ఇవన్నీ బేరీజు వేసుకుంటున్న బిజెపి అగ్రనేతలు వీలైనంతవరకు చంద్రబాబు దూరం పెట్టడమే మంచిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయం బాబుకు తెలిసినా, ఎప్పటికైనా వారు కరుణిస్తారనే ఆశతో తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube