భద్రత కుదింపు పై హైకోర్టు ని ఆశ్రయించిన బాబు

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి కల్పించిన భద్రతను కుదించిన సంగతి తెలిసిందే.అయితే ఈ భద్రతా కుదింపు పై చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా మంగళవారం విచారణ జరగనుంది.

 Chandrababu Approacheshighcourt-TeluguStop.com

ఆయనకు గతంలో అందించిన సెక్యూరిటీ నే అందించాలి అని కోరుతూ పిటీషన్ లో పేర్కొన్నారు.గతంలో బాబుకు ఒక అదనపు ఎస్పీ,డీఎస్పీ,ముగ్గురు ఆర్ ఐ ల తో పాటు మూడు బృందాల భద్రతా ఉండేది.

అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ముఖ్యమంత్రి,తో పాటు ఇతర మంత్రుల భద్రతను కూడా వైసీపీ ప్రభుత్వం కుదించింది.

-Telugu Political News

మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉండటంతో పాటు జెడ్‌ప్లస్‌ భద్రత కలిగిన చంద్రబాబు భద్రతను కుదించడాన్ని తెదేపా నేతలు తప్పుబడుతున్నారు.భద్రత కుదింపు వలన తమ నేతకు ప్రాణ భయం ఉందనే ఆందోళన తెదేపా నేతలు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తనకు కుదించిన భద్రతను తిరిగి కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
స్కేలు ప్రకారం భద్రత కుదించినప్పటికీ రోడ్డు క్లియరెన్స్‌ తదితర అంశాలను గతంలో మాదిరిగానే పాటించనున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube