ఎల్జీ పాలిమర్స్ కి భూఅనుమతులుపై స్పందించిన చంద్రబాబు

ఏపీలో ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న ఇష్యూ కూడా రాజకీయ కోణంలోకి టర్న్ తీసుకుంటుంది.కరోనాని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే, ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటూ ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు.

 Chandrababu Responds On Lg Polymer, Ap Politics, Ysrcp, Tdp, Ap Cm Jagan, Visakh-TeluguStop.com

తాజాగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.ఈ ఘటనలో 12 మంచి చనిపోగా వందల సంఖ్యలో బాధితులు అయ్యారు.

ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీ సమీపంలోని గ్రామాలలో విషవాయువుల ప్రభావం ఉంది.అయితే ఈ ఎల్జీ పాలిమర్స్ అనుమతులపై అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు.

అధికార పార్టీ కావాలంటే తన స్వప్రయోజనాల కోసం అత్యవసరంలో ఉన్నపళంగా అనుమతులు ఇవ్వడంతోనే ఇంత మంది ప్రాణాలు పోయాయని ఆరోపణలు చేస్తున్నారు.అలాగే కేంద్ర అనుమతులు లేకుండా ఫ్యాక్టరీకి పోల్యుషన్ క్లియరెన్స్ ఇచ్చారని విమర్శలు చేస్తున్నారు.

అయితే అధికార పార్టీ నేతలు ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ ఎల్జీ పాలిమర్స్ విస్తరణకి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అనుకూలంగా జీవో జారీ చేసినట్లు, సింహాచలం భూములని కంపెనీకి దారాదత్తం చేసే ప్రయత్నం చేసారని విమర్శించారు.తాజాగా ఈ విమర్శలపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

హిందుస్థాన్‌ పాలిమర్స్‌కు 1964 నవంబర్‌ 23న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 2177 ద్వారా 213 ఎకరాల భూమిని ఇచ్చింది.ఈ భూమికి 1992 అక్టోబర్‌ 8న అప్పటి ప్రభుత్వం జీవో 1033 ద్వారా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ నుంచి మినహాయింపులు ఇచ్చింది.

హైకోర్టు సూచనల మేరకే టీడీపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది.ఇందులో తాము కావాలని ఏమీ చేయలేదని తెలిపారు.

అయితే వైసీపీ తమ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి తమపై విమర్శలు చేస్తూ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు విమర్శించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube