ఆ వలస నేతలకు నో టికెట్  ! చంద్రబాబు సంచలన కామెంట్స్ 

Chandrababu Announced That He Would Give Tickets To Those Who Join The Party Before The Elections

తెలుగుదేశం పార్టీలో పెను సంచలనం సృష్టించేందుకు టీడీపీ  అధినేత చంద్రబాబు డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు .అందుకే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంపైన ఆయన పూర్తిగా దృష్టి సారించారు.

 Chandrababu Announced That He Would Give Tickets To Those Who Join The Party Before The Elections-TeluguStop.com

ఈ మేరకు గతంలో మాదిరిగా మొహమాటం రాజకీయాలు చేయకూడదని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా భారీ ప్రక్షాళన పార్టీలో చేపట్టాలని డిసైడ్ అయిపోయారు.  ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి, తనకి జనాల్లో సానుభూతి పెరిగిందని,  దీనిని సద్వినియోగం చేసుకుంటూ వైసిపి ఇరుకున పెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

  అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ సందర్భంగా వలస నేతల విషయంలో బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Chandrababu Announced That He Would Give Tickets To Those Who Join The Party Before The Elections-ఆ వలస నేతలకు నో టికెట్  చంద్రబాబు సంచలన కామెంట్స్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మేరకు సొంత పార్టీలోనే నేతలకు బాబు వార్నింగ్ ఇచ్చారు.నిన్న జమ్మలమడుగులో కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ లో చేరారు.

మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి , ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి,  తదితరులు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమక్షంలో చేరారు.  ఈ సందర్భంగా చంద్రబాబు  వలస నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఎన్నికలకు ముందు పార్టీల్లోకి వలస వచ్చే నాయకులకు టికెట్ ఇచ్చేది లేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు .పార్టీ కోసం ఎవరైతే పూర్తిగా కష్టపడతారో వారికి మాత్రమే టికెట్ ఇస్తామని ప్రకటించారు.ఎన్నికలకు ముందు పార్టీలో చేరదామని భావించిన వారికి అంతగా ప్రాధాన్యం ఇచ్చేది లేదు అంటూ కామెంట్స్ చేశారు.అయితే బాబు చేసిన కామెంట్స్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరదామని చూస్తున్న నాయకులకు గట్టి షాక్ ఇచ్చాయి.

Telugu Chandrababu, Janasena, Telugudesam, Ysrcp-Telugu Political Newsవరుసగా పార్టీలు మారుతూ వచ్చే వారికి అస్సలు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం ఇవ్వని,  అటువంటి నేతలను  చేర్చుకునేదే లేదు అంటూ పరోక్షంగా కొంతమంది పై కామెంట్స్ చేశారు.చంద్రబాబు చేసిన కామెంట్స్ పార్టీల్లో చర్చనీ యాంశంగా మారాయి.  క్రమక్రమంగా టీడీపీ గ్రాఫ్ తగ్గుతూ ఉండటంతో , ఎన్నికలకు ముందు నుంచి టీడీపీలోకి వచ్చేందుకు చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు.అయితే ఇప్పుడు అటువంటి నేతలకు బాబు మాటలు మింగుడుపడడం లేదు.

#Chandrababu #Ysrcp #Telugudesam #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube