తెలుగుదేశం అభ్యర్థులు జాబితా ప్రకటించిన చంద్రబాబు!  

టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..

  • ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీవీ టిడిపి పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల మొదటి జాబితాను తాజాగా ప్రకటించాడు. మొత్తం 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను విడుదల చేశారు. 65 నియోజకవర్గాలు మినహా మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఎమ్మెల్యే టికెట్ సొంతం చేసుకున్న అభ్యర్థుల అనుచరులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.

  • ఇదిలా ఉంటే చంద్రబాబు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తృత పర్యటనకు సిద్ధమవుతున్నారు. శనివారం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని చంద్రబాబు తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. రోజుకి 3 నియోజకవర్గాలతో చొప్పున పర్యటించి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు.