బాబు అలా చేస్తే ? జగన్ ఇలా చేస్తాడా ?  

Chandrababu And Ys Jagan Plans About Election Result-chandrababu,winning Mla\\'s,ycp And Tdp,ys Jagan,చంద్రబాబు,జగన్

ఏపీలో ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల పోరు తెలుగుదేశం పార్టీ నాయకులకు నిద్రపట్టకుండా చేస్తోంది. పోలింగ్ సరళిని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపించడంలేదు అనే భావనలో పార్టీ క్యాడర్ ఉన్నారు. కానీ ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఏపీలో ప్రభుత్వం మనమే ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని పదే పదే చెప్తూ పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపుతూ తాను దైర్యం తెచ్చుకుంటున్నాడు..

బాబు అలా చేస్తే ? జగన్ ఇలా చేస్తాడా ?-Chandrababu And Ys Jagan Plans About Election Result

గత ఎన్నికల్లో చంద్రబాబు వేసిన స్కెచ్ కి తోడు బీజేపీ, పవన్ కళ్యాణ్ గాలి బాగా కలిసివచ్చి టీడీపీకి అధికారం దక్కింది. కానీ ఇప్పుడు టీడీపీకి ఆ పరిస్థితి లేదు. అలాగే గత ఎన్నికల్లో కొంచెం తడబడ్డ జగన్ ఇప్పుడు ఆ తడబాట్లన్నీ సరిచేసుకుని సరైన ప్రణాళికతో రంగంలోకి దిగాడు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కౌంటింగుకు సమయం దగ్గరకు వస్తోంది . దాంతో అటు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. పోలింగ్ తేదీ ముగిసిన తేదీ నుంచి కూడా క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు బిజీగా గడుపుతున్నాడు.

ఇక వైసీపీ విషయానికి వస్తే ఇప్పటివరకు పార్టీ క్యాడర్ కి రెస్ట్ ఇచ్చేసింది. ఇక కౌంటింగ్ యుధ్ధం ఉంది. అక్కడ కూడా బాబు మేనేజ్మెంట్ ని తట్టుకునేందుకు జగన్ ఎత్తులు మీద పై ఎత్తులు వేస్తున్నాడు.

దానిలో భాగంగానే తమ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను జగన్ ఈ నెల 19 తరువాత ఒక చోటకు చేర్చే పనిలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ 19 తేదీ నాటికి ఎన్నికల తంతు మొత్తం పూర్తి అవుతాయి. ఎగ్టిట్ పోల్ సర్వేలు వస్తాయి. ఈలోపున టీడీపీ ఏదైనా కొత్త ఎత్తుగడ వేస్తుందేమో అన్న సందేహం జగన్ లో కనిపిస్తోంది. తమ పార్టీకి మెజార్టీ స్థాయిలో సీట్లు వస్తే ఫర్వాలేదు కానీ, బొటాబొటిగా సీట్లు వస్తే ఏంటి పరిస్థితి ? టీడీపీ తప్పకుండా తమ పార్టీ నుంచి గెలిచిన వారిని ప్రలోభపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నాడు.

అందుకే తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు చేజారిపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.