ఉడవల్లి అంటే చంద్రబాబు కి భయం ఎందుకో..తెలుసా     2017-12-10   00:45:48  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీ లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ..సాక్షాత్తు చంద్రబాబు తో సహా

వణుకు మొదలయ్యింది..చలికాలం కదా అంతేలే అనుకోకండి..ఈ గుబులు సోమవారం గురించి..అది కూడా ఉడవల్లి వల్ల వస్తున్న గుబులు. మాములుగానే ఉడవల్లి అంటేనే అతని ప్రత్యర్ధులు బయపడిపోతుంటారు..అందుకే సామాన్యంగా ఉడవల్లి తో ఎవరు ఎదురు దాడికి దిగరు. అయితే ఇప్పుడు ఉడవల్లి చంద్రబాబు,ఉమామహేశ్వరరావు లకి మాత్రం టెన్షన్ పెట్టిస్తున్నాడు. విషయమేమిటంటే

పోలవరం-చంద్రబాబు బండారాన్ని సోమవారం పూర్తి ఆధారాలతో బయటపెడతా అంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు..పోలవరం నిర్మాణం, చేసిన ఖర్చులు తదితరాలపై ఎవరికీ ఎటువంటి సమాచారం అందకుండా ప్రభుత్వం వీలైనంత జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టే ఎవరడిగినా ఉన్నతాధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారట. దాంతో ఉండవల్లి సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. వెంటనే దరఖాస్తును పరిశీలించిన సమాచార హక్కు చట్టం ఉన్నతాధికారులు ఉండవల్లికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలంటూ ఆదేశించారు. దాంతో అధికారులు ఉండవల్లితో మాట్లాడారు. తమ కార్యాలయానికి వచ్చి కావాల్సిన సమాచారాన్ని తీసుకోవచ్చంటూ చెప్పారు

పోలవరానికి సంభందించిన అన్ని కార్యకలాయాల్లో ఫైళ్లు తిరగేసిన ఉండవల్లి ఇప్పుడు బాబు నీ బండారం నేను సోమవారం మీడియా సాక్షిగా బయటపెడుతాను అంటూ చెప్పేశారు…అంటే అప్పటికే పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతిని కూడా సేకరించి పెట్టుకున్నారట. దానికితోడు తాజాగా అధికారిక సమాచారం కూడా సేకరించుకున్నారు. దాంతో ‘పోలవరం-చంద్రబాబు’ బండారాన్ని బయటపెడతా అని ప్రకటించగానే ఒక్కొక్కళ్ళకి గుండెలు జారి అరికాలులోకి వచ్చేస్తున్నయట. సహజంగానే ఉండవల్లి సంధించే ప్రశ్నలకి గుటకలు మిగుతారు చాలా మంది..మరి ఉడవల్లి సోమవారం బయటపెట్ట బోతున్న విషయాలు విని టిడిపి వాళ్ళు ఏమయ్యిపోతారో అని తెగ మదనపడుతున్నారట తెలుగు తమ్ముళ్ళు