చంద్రబాబు - పవన్ కలిసి ఆడుతున్న డ్రామా అంటున్న వైసీపీ మంత్రి..!!

Chandrababu And Pawan Kalyan Joint Politics

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీ… ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటలు యుద్ధాలను పేల్చుతున్నాయి.ఈ క్రమంలో టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆగమేఘాల మీద స్పందించడాని కొడాలి నాని తప్పు పట్టారు.

 Chandrababu And Pawan Kalyan Joint Politics-TeluguStop.com

అప్పట్లో పోసాని కృష్ణ మురళి ఇంటి పై పవన్ కళ్యాణ్ తన అభిమానులు దాడి చేస్తే… ఎందుకు స్పందించలేదు అని .అప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదా.? అని కొడాలి నాని ప్రశ్నించారు.ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్తానని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు.

పోసాని కృష్ణమురళి ఇంటి పై పవన్ అభిమానులు చేసిన దాడి  అరాచకం కాదా.? కావాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి డ్రామాలాడుతున్నారని కొడాలి నాని తాజా పరిస్థితిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తి అని ఢిల్లీలో ఉన్న మోడీ అమిత్ షా కు తెలుసు అని కొడాలి స్పష్టం చేశారు.అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అమిత్ షా తిరుమల తిరుపతికి వచ్చిన టైంలో…టీడీపీ కార్యకర్తల చేత అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ళు విసరటం జరిగిందని తెలిపారు.

 Chandrababu And Pawan Kalyan Joint Politics-చంద్రబాబు – పవన్ కలిసి ఆడుతున్న డ్రామా అంటున్న వైసీపీ మంత్రి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో తాజాగా ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి.ఏ మొహం పెట్టుకుని ఫిర్యాదు చేస్తారని కలుస్తారని ప్రశ్నించారు.జగన్ నీ ఇబ్బంది పెట్టడానికి.చంద్రబాబు రకరకాల డ్రామాలాడుతున్నారని గంజాయి సరఫరా అంటూ లేనిపోని ప్రచారం చేస్తున్నారని.

కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

#YCP #KodaliNani #Amit Shah #Chandrababu #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube