నాకు పీఎం వద్దు .. నాకు సీఎం వద్దు ! తండ్రి కొడుకుల త్యాగం !

రాజకీయాల్లో భజనపరులు ఉండడం షరా మాములే ! అధినాయకుడి మెప్పు పొంది ఏదో ఒక లబ్ది పొందాలని చూసేవారు సాధారణంగానే ఇక్కడ ఎక్కువ ఉంటారు.ఇక అధికార పార్టీ అయితే చెప్పేది ఏముంది.

 Chandrababu And Lokesh About Pm And Cm Posts-TeluguStop.com

ఇక ఏపీ సీఎం చంద్రబాబు భజన పరుల్లో అందరికంటే ఇప్పుడు ముందు వరుసలో ఉన్నవారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.ఈయన కు అలవాటులేని పని కొత్తగా ఎంచుకుని బాబు అండ్ ఫ్యామిలీని పొగడడమే పనిగా పెట్టుకున్నాడు.

ఇటీవల మహానాడులో జేసీ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి.

ఇక మీరు ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు .మీరు అర్జంటుగా ప్రధానమంత్రి అవ్వాల్సిందే అంటూ జేసీ డిమాండ్ కూడా చేసాడు.దీనికి చంద్రబాబు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

జేసీ అంతటితో ఆగాడా.? వచ్చే ఎన్నికలతో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడని, లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం కూడా చెప్పేసాడు.రాజకీయాలు మాని ఇలా జోస్యం చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నాడో కానీ దివాకర్ రెడ్డి ఈ మాటలతో పెద్ద భజన పరుడు అనిపించుకున్నాడు.చంద్రబాబు, లోకేష్ లను అలా అమాంతం పైకి ఎత్తేశాడు .

జేసీ సంగతి పక్కన పెడితే … చంద్రబాబు మాత్రం తనకు ప్రధానమంత్రి పదవి వద్దు అంటున్నాడట.ఈ మధ్య ఇటువంటి మాటలు చాలా సందర్భాల్లో బాబు మాట్లాడాడు.

ఇది బాబు తనకు తాను తన పరపతిని తగ్గించుకోవడమే అనడంలో సందేహమే లేదు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల వాళ్లూ కలిసి చంద్రబాబును ప్రధాని పీఠం మీద కూర్చోమని ఒత్తిడి చేస్తున్నట్టుగా బాబు ఫీల్ అయిపోతున్నాడు.

వాస్తవంగా చూసుకుంటే.కేవలం 25 ఎంపీ సీట్ల ప్రాంతంలోని పార్టీకి అధినేత ప్రధాని కావాలని ఎలా అనుకుంటాడో చంద్రబాబు నాయుడుకే తెలియాల్సి ఉంది.

చంద్రబాబు అలా చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటే చినబాబు లోకేష్ మాత్రం ఊరికే ఉంటాడా ఏంటి .? ఏదో ఒకటి చెప్పి జనాల్లో పలచన అవ్వాలని తనకు మాత్రం ఉండదా .? అందుకే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడంలేదని లోకేష్ బాబు చెప్పాడు.అంతేనా .? ఎప్పటికీ తమ ముఖ్యమంత్రి చంద్రబాబే అని లోకేష్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube